NTV Telugu Site icon

IPL: ఢిల్లీ యువ ఫేసర్ రసీఖ్ సలాంకు బీసీసీఐ మందలింపు

Rasikh 123

Rasikh 123

ఐపీఎల్ అంటేనే దూకుడు. బ్యాటర్లు, బౌలర్లు తమ అద్భుత ప్రదర్శనను చూపించేందుకు, వారి సత్తాను నిరుపించుకునేందుకు ఐపీఎల్ ఓ మంచి వేదికగా మారింది. బ్యాటర్లే కాకుండా బౌలర్లు కూడా కీలక సమయంలో మ్యాచ్ కు ప్రాణం పోస్తుంటారు. స్టార్ బ్యాటర్లను నిలువరిస్తూ టీంకి ప్రోత్సాహాన్ని అందిస్తుంటారు. కాగా.. ఇటీవల జరిగిన ఓ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిల్ కు చెందిన యువ ఫేసర్ రసీఖ్ సలాం ప్రవర్తనను బీసీసీఐ మందలించింది. మొన్న గుజరాత్ టైనాన్స్- ఢిల్లీ క్యాపిల్స్ మధ్య జరిగిన మ్యాచ్లో ఈ యువ క్రికెటర్ రసీఖ్ సలాం అతి చేసినట్లు బీసీసీఐ తేల్చింది. ఇలాంటి ఘటనలు మరోసారి పునరావృతం కాకుండా చూడాలని రసీఖ్ కు సూచించింది.

READ MORE: Kalpana Soren: ఎన్నికల బరిలోకి హేమంత్ సోరెన్ సతీమణి.. ఎక్కడ్నుంచంటే..!

ఢిల్లీ వేదికగా బుధవారం జరిగిన మ్యాచ్లో రసీఖ మంచి ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. నాలుగు ఓవర్లలో 44 పరుగులు ఇచ్చిన అతడు.. గుజరాత్ టైటాన్స్ టీంకి చెందిన ముగ్గురు కీలక బ్యాటర్లను ఔట్ చేశాడు. అందులో షారుఖ్ ఖాన్(8), సాయి సుదర్శన్(65), రవి శ్రీనివాససాయి కిషోర్(13)లు ఉన్నారు. లక్ష్య చేధనలో ప్రమాదకారిగా మారుతున్న సాయి సుదర్శన్ ను ఔట్ చేయడంతో మ్యాచ్ కాస్తా ఢిల్లీ వైపు తిరిగింది. గుజరాత్ పై 4 రన్ల తేడాతో ఢిల్లీ విజయం సాధించింది. టాస్ గెలిచిన గుజరాత్ తొలుత బౌలింగ్ ఎంచుకోగా.. ఢిల్లీ 20 ఓవర్లలో 224 భారీ స్కోర్ చేసింది. లక్ష్య చేధనలో చివరి బంతి వరకు పోరాడిన ఢిల్లీ 220 పరుగులే సాధించింది. విషయంలో తన వంతు పాత్ర పోషించిన ఈ కుర్రాడు..వికెట్ తీసిన ప్రతీసారి కాస్త వైల్డ్ గా సెలబ్రెట్ చేసుకున్నాడు. ఇది గమనించిన బీసీసీఐ అతడిని మందలించి.. ఐపీఎల్ రూల్స్ ను అతిక్రమించినందుకు గాను ఈ మేరకు చర్యలు తీసుకుంది.