IPL Auction : ఐపీఎల్ మినీ వేలంలో ఎవరిని సొంతం చేసుకోవాలనే విషయమై ఫ్రాంచైజీలు కసరత్తులు ప్రారంభించాయి. ఐపీఎల్ మినీ వేలం డిసెంబర్ 23న కొచ్చిలో జరగనుండగా.. మెజార్టీ ఫ్రాంచైజీలు వేలం తేదీని మార్చాలని బీసీసీఐని కోరనున్నాయని తెలుస్తోంది. డిసెంబర్ 25న క్రిస్మస్ ఉండటంతో.. ఫ్రాంచైజీలకు చెందిన విదేశీ సహాయక సిబ్బంది 23న అందుబాటులో ఉండే అవకాశాలు లేవు. దీనిపై బీసీసీఐ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. చర్చల తర్వాత నిర్ణయం తీసుకుంటామని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు.
Read Also: Driverless Bus: డ్రైవర్ లేని బస్సులో చక్కర్లు కొట్టాలనుందా.. మీకోసం వచ్చేస్తున్నాయ్
ఇక ఐపీఎల్ మినీ వేలంలో పాల్గొన తలిచిన క్రికెటర్లు డిసెంబర్ 15 నాటికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. వేలం తేదీ మార్పు విషయమై ఫ్రాంచైజీలు అభ్యర్థిస్తే బోర్డు సానుకూలంగా స్పందించే అవకాశం ఉంది. వేలాన్ని కాస్త ముందు గానీ.. జనవరి తొలి వారంలో గానీ నిర్వహించే ఛాన్స్ ఉంది. 250 మంది క్రికెటర్లు వేలానికి రానున్నారు. కానీ, ఫ్రాంచైజీలకు కావాల్సింది సుమారు 50-60 మందే. ఈ విడత ఇంగ్లండ్ మాజీ టెస్ట్ కెప్టెన్ జో రూట్ కూడా రిజిస్టర్ చేసుకున్నాడు. ప్రధానంగా శామ్ కుర్రన్, బెన్ స్టోక్స్, కామెరాన్ గ్రీన్ కోసం ఈ విడత ఫ్రాంచైజీల మధ్య పోటీ ఎక్కువగా ఉండనుంది.
