NTV Telugu Site icon

SRH Full Squad: తెలుగు ఆటగాళ్లకు నో ఛాన్స్.. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఇదే!

Srh Logo

Srh Logo

SRH Full Squad for IPL 2024: దుబాయ్‌లో మంగళవారం జరిగిన ఐపీఎల్‌ 2024 మినీ వేలం అంచనాలకు మించి సాగింది. ప్రాంచైజీ ఓనర్స్ డబ్బు ఖర్చు చేసేందుకు ఏమాత్రం వెనకడుగు వేయలేదు. ముఖ్యంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ ఓనర్ కావ్యా మారన్‌ గతంలో ఎన్నడూ లేని రీతిలో వేలంలో దూకుడు కనబర్చారు. స్టార్ ఆటగాళ్లను జట్టులో తీసుకునేందుకు ఇతర ప్రాంచైజీలతో కావ్యా పోటీ పడ్డారు. ప్రపంచకప్ 2023 విన్నింగ్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్‌ను రూ. 20.50 కోట్ల రికార్డు ధర పెట్టి కొనుగోలు చేశారు. కమిన్స్‌ను జట్టు కెప్టెన్‌గా ప్రకటించే అవకాశం ఉంది.

ప్రపంచకప్ 2023 ఫైనల్ హీరో ట్రావిస్ హెడ్‌‌ను కొనేందుకు కూడా కావ్యా మారన్‌ ఆసక్తి చూపారు. హెడ్‌‌ను రూ. 6.80 కోట్లకు దక్కించుకున్నారు. శ్రీలంక స్పెషలిస్ట్ స్పిన్నర్ వానిందు హసరంగాను 1.50కే సొంతం చేసుకున్నారు. జయదేవ్ ఉనద్కత్‌ను రూ. 1.60కు సన్‌రైజర్స్ సొంతం చేసుకుంది. ఆకాశ్ సింగ్‌, జాథవెద్ సబ్రమణ్యన్‌లను వారి కనీస ధర రూ. 20 లక్షలకు కొనుగోలు చేసింది. అయితే తెలుగు రాష్ట్రాలకు ప్రాతినిథ్యం వహిస్తున్న సన్‌రైజర్స్.. మరోసారి తెలుగు ఆటగాళ్లకు మొండి చెయ్యి చూపింది. ఏ ఆటగాడిని కూడా కనీస ధరకు తీసుకునేందుకు ఆసక్తి చూపలేదు.

సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆక్షన్ ప్లేయర్లు:
ట్రావిస్ హెడ్ రూ. 6.80 కోట్లు
వానిందు హసరంగా రూ. 1.5 కోట్లు
ప్యాట్ కమిన్స్ రూ. 20.50 కోటలు
జయదేవ్ ఉనద్కత్ రూ. 1.60 కోట్లు
ఆకాశ్ సింగ్ రూ. 20 లక్షలు
జాథవెద్ సుబ్రమణ్యన్ రూ. 20 లక్షలు

Also Read: Gold Rate Today: పసిడి ప్రియులకు కాస్త ఊరట.. ఈరోజు గోల్డ్‌ రేట్స్‌ ఎలా ఉన్నాయంటే?

సన్‌రైజర్స్ హైదరాబాద్ రిటైన్డ్ లిస్ట్:
ఎయిడెన్ మార్క్‌రమ్
గ్లెన్ ఫిలిప్స్
అబ్దుల్ సమద్
రాహుల్ త్రిపాఠి
హెన్రీచ్ క్లాసెన్
అన్‌మోల్ ప్రీత్ సింగ్
ఉపేంద్ర సింగ్ యాదవ్
నితీష్ కుమార్ రెడ్డి
షెహ్‌బాజ్ అహ్మద్
మయాంక్ అగర్వాల్
అభిషేక్ శర్మ
మార్కో జాన్సెన్
వాషింగ్టన్ సుందర్
సన్వీర్ సింగ్
ఉమ్రాన్ మాలిక్
భువనేశ్వర్ కుమార్
టీ నటరాజన్
మయాంక్ మార్కండే
ఫజలక్ ఫరూఖీ

Show comments