IPL Auction 2024 Date and Time: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024 మినీ వేలానికి రంగం సిద్ధమైంది. ఈ వేలం కోసం 1166 మంది ఆటగాళ్లు తమ పేర్లను రిజిస్టర్ చేసుకోగా.. ఫ్రాంచైజీలతో సంప్రదించాక ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ 333 మందితో తుది జాబితాను ప్రకటించింది. ఇందులో 214 మంది ఇండియన్ ప్లేయర్స్ ఉండగా.. 119 మంది విదేశీయులు, ఇద్దరు అసోసియేట్ దేశాల నుంచి ఉన్నారు. 333 మంది ఆటగాళ్లలో స్టార్ ఆటగాళ్లపై కాసుల వర్షం కురవనుంది.
ఐపీఎల్ 2024 మినీ వేలం డిసెంబర్ 19న జరగనుంది. దుబాయ్‌లో కోకా కోలా ఏరేనా హోటల్‌లో ఈ వేలం జరగనుంది. భారత కాలమానం ప్రకారం డిసెంబర్ 19న మధ్యాహ్నం 2.30 గంటలకు వేలం ఆరంభం అవుతుంది. మినీ వేలం కాబట్టి ఒకే రోజులో ముగుస్తుంది. భారత్ అవతల జరుగుతున్న తొలి వేలం ఇదే కావడం విశేషం. ఇప్పటివరకు జరిగిన అన్ని వేలంలు భారత్‌లోనే జరిగాయి. ముంబై, కోల్‌కతా, బెంగళూరులో జరగ్గా.. మొదటిసారి వేరే దేశంలో వేలం జరగబోతోంది.
Also Read: Raj Limbani: 7 వికెట్లతో చెలరేగిన రాజ్ లింబాని.. ఆసియాకప్ 2023 సెమీస్‌కు దూసుకెళ్లిన భారత్!
ఐపీఎల్ 2024 వేలంను స్టార్ స్పోర్ట్స్, జియా సినిమాలో ప్రత్యక్ష ప్రసారం కానుంది. మొబైల్ లేదా టీవీలో అయినా ఈ వేలాన్ని ఉచితంగా చూడవచ్చు. స్టార్ స్పోర్ట్స్, జియా సినిమాలో భారత్‌లో మాత్రమే స్ట్రీమింగ్ అవుతోంది. మిగతా దేశాల్లో వేరే బ్రాడ్ కాస్టర్‌లు వేలంను లైవ్ స్ట్రీమింగ్ టెలికాస్ట్ చేయనున్నాయి. ఇక ఐపీఎల్ 2024 వేలంలో ఖర్చు పెట్టడానికి ఫ్రాంఛైజీల వద్ద రూ. 262.95 కోట్లు ఉండగా.. మొత్తం 77 మందిని కొనుగోలు చేయాల్సి ఉంది. ఇందులో గరిష్టంగా 30 మంది విదేశీ క్రికెటర్లను ప్రాంఛైజీలు కొనుక్కోవచ్చు