NTV Telugu Site icon

Mumbai Indians: హార్దిక్‌ పాండ్యా పరిపూర్ణమైన కెప్టెన్‌ కాదు.. రోహిత్ శర్మకు ముందే తెలిసి ఉంటుంది!

Hardik Pandya Mi

Hardik Pandya Mi

Rohit Sharma praised by Aakash Chopra: ఐపీఎల్ 2024కు ముందు ముంబై ఇండియన్స్‌ ప్రాంచైజీ అభిమానులకు వరుస షాక్స్ ఇస్తోంది. ముందుగా గుజరాత్ టైటాన్స్ సారథిగా ఉన్న హార్దిక్‌ పాండ్యాను ట్రేడింగ్ ద్వారా తీసుకుని.. ఆపై కెప్టెన్‌ రోహిత్ శర్మ స్థానంలో అతడిని నియమించింది. దాంతో పాండ్యాను కెప్టెన్‌గా నియమించడం కోసం రోహిత్‌ను తప్పించడం సరికాదని సోషల్ మీడియాలో ఫాన్స్ మండిపడుతున్నారు. ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లో ముంబై ఇండియన్స్‌ను అన్‌ఫాలో అయ్యే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. ఈ క్రమంలో హార్దిక్‌ కెప్టెన్సీపై భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా సంచలన వ్యాఖ్యలు చేశాడు. హార్దిక్‌ పాండ్యా పరిపూర్ణమైన కెప్టెన్‌ కాదు అని పేర్కొన్నాడు.

ఆకాశ్‌వాణిలో ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ… ‘నాకు తెలిసి ముంబై జట్టుకు కెప్టెన్సీ ఇస్తామనే హామీతోనే హార్దిక్‌ పాండ్యా గుజరాత్‌ టైటాన్స్ టీంను వీడాడు. ఈ విషయం తప్పకుండా రోహిత్ శర్మకు తెలిసే ఉంటుంది. భవిష్యత్తు ప్రణాళికల గురించి రోహిత్‌తో ముంబై యాజమాన్యం చర్చించి ఉంటుంది. గుజరాత్‌ కెప్టెన్‌గా హార్దిక్‌ సక్సెస్ కావడంలో ఆశిష్ నెహ్రా కీలక పాత్ర పోషించాడు. మైదానంలో వారి మధ్య సమన్వయం మనం చాలాసార్లు చూశాం. ఇప్పుడు ముంబై చేయాల్సింది కూడా ఇదే. హార్దిక్‌కు సహకరించాల్సిన బాధ్యత ముంబైపై ఉంది. అప్పుడే మైదానంలో అనుకున్న ఫలితాలు వస్తాయి. ఎందుకంటే హార్దిక్‌ ఇంకా పరిపూర్ణమైన కెప్టెన్‌గా మారలేదనేది నా అభిప్రాయం’ అని అన్నాడు.

Also Read: IPL Auction 2024: ఐపీఎల్ 2024 వేలంలో రికార్డు ధ‌ర ప‌లికేది వీరికే.. ప్రపంచక‌ప్ హీరో కంటే ర‌వీంద్రకే ఎక్కువ!

‘రోహిత్ శర్మ దిగ్గజ క్రికెటర్ మాత్రమే కాదు గొప్ప కెప్టెన్‌. ఐపీఎల్‌లో 10 ఏళ్లు జట్టును నడిపించి ఐదు టైటిళ్లను అందించాడు. ముంబై జట్టు కోసం చాలా శ్రమించాడు. అయితే ఏదో ఒక దశలో భవిష్యత్తు గురించి ఆలోచించాల్సి ఉంటుంది. గత రెండేళ్లలో ముంబై ప్రదర్శన గొప్పగా లేదు. అందుకే మరొకరికి అవకాశం ఇవ్వాలని యాజమాన్యం భావించి ఉంటుంది. ఇదే సరైన సమయమని హార్దిక్‌ పాండ్యాను తీసుకొచ్చింది. ఇది కఠిన నిర్ణయమే. అయితే రోహిత్ స్వయంగా కెప్టెన్సీపై నిర్ణయం తీసుకుంటే బాగుండేదని, ఐపీఎల్ 2024లో కనీసం ఒక్క మ్యాచ్‌లోనైనా సారథ్యం వహించేలా చేస్తే బాగుండేదన్న సలహాలు సోషల్‌ మీడియాలో వస్తున్నాయి. వాటిపై నేను స్పందించను. ఒకటి మాత్రం చెప్పగలను.. వ్యక్తిగతం కంటే జట్టే ముఖ్యం’ అని ఆకాశ్ చోప్రా చెప్పుకోచ్చాడు.

Show comments