IPL 2027: పూర్తయిన రిటెన్షన్ ప్రక్రియ.. ఎవరి పర్సులో ఎంత..? టాప్‌లో LSG..

Ipl

Ipl

ఐపీఎల్ 2027 మినీ వేలానికి ముందు అన్ని ఫ్రాంచైజీలు తమ ఆటగాళ్ల రిటెన్షన్ ప్రక్రియను పూర్తి చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో ఏ జట్టు పర్సులో ఎంత మొత్తం మిగిలి ఉందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొనగా, లక్నో సూపర్ జైంట్స్ (LSG) జట్టు అత్యధికంగా రూ. 47.45 కోట్ల పర్సుతో అగ్రస్థానంలో నిలిచింది. పలువురు స్టార్ ఆటగాళ్లను విడుదల చేసిన జట్లన్నీ రాబోయే వేలంలో భారీ వ్యూహాలతో బరిలోకి దిగేందుకు సర్వం సిద్ధం చేసుకున్నాయి.

ప్రస్తుతం అన్ని జట్ల వద్ద మిగిలిన బడ్జెట్ వివరాలను పరిశీలిస్తే, కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) రూ. 41.65 కోట్లు, సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) రూ. 40.15 కోట్లు, ఢిల్లీ క్యాపిటల్స్ (DC) రూ. 39.50 కోట్లు, ముంబై ఇండియన్స్ (MI) రూ. 32.60 కోట్ల పర్సుతో కొనసాగుతున్నాయి. అదేవిధంగా చెన్నై సూపర్ కింగ్స్ (CSK) వద్ద రూ. 28.05 కోట్లు, రాజస్థాన్ రాయల్స్ (RR) వద్ద రూ. 27.05 కోట్లు, పంజాబ్ కింగ్స్ (PBKS) వద్ద రూ. 18.60 కోట్ల బడ్జెట్ మిగిలి ఉంది.

చివరిగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) రూ. 14.15 కోట్లు, గుజరాత్ టైటాన్స్ (GT) రూ. 8.75 కోట్ల పర్సుతో ఈ మినీ వేలానికి సిద్ధమయ్యాయి. విడదలైన ఆటగాళ్ల జాబితా ప్రకారం ఆయా ఫ్రాంచైజీలు ఖాళీగా ఉన్న స్లాట్లను భర్తీ చేయడానికి, తమ జట్లను మరింత పటిష్టం చేసుకోవడానికి ఈ మిగిలిన మొత్తాన్ని వేలంలో వ్యూహాత్మకంగా ఉపయోగించనున్నాయి.