IPL 2026: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026 సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని జట్ల మధ్య ట్రేడ్ చర్చలు వేగంగా సాగుతున్నాయి. తాజాగా చెన్నై సూపర్ కింగ్స్ (CSK) తమ స్పిన్ విభాగాన్ని బలోపేతం చేయడానికి గుజరాత్ టైటాన్స్ (GT) ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్‌ను తమ జట్టులోకి తీసుకువాలనే ప్రయత్నం చేసింది. అయితే, గుజరాత్ టైటాన్స్ ఈ ప్రతిపాదనను తిరస్కరించింది.
అందిన రిపోర్ట్స్ ప్రకారం.. ఈ రెండు జట్ల మధ్య సుందర్ ట్రేడ్‌పై చర్చలు ప్రారంభమయ్యాయి. చెన్నై సూపర్ కింగ్స్ తరపున స్పిన్ విభాగం బలహీనంగా ఉండటంతో సుందర్‌పై ఆసక్తి చూపిస్తున్నారు. రవిచంద్రన్ అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించగా.. రవీంద్ర జడేజా కూడా రాజస్థాన్ రాయల్స్ (RR) వైపు వెళ్లే అవకాశాలు ఉన్న నేపథ్యంలో CSKకి నాణ్యమైన స్పిన్నర్ల కొరత తలెత్తింది. ప్రస్తుతం చెన్నై జట్టులో ఆఫ్ఘానిస్తాన్ స్పిన్నర్ నూర్ అహ్మద్ మాత్రమే ప్రాధాన్యమైన స్పిన్ ఆప్షన్‌గా ఉన్నాడు. ఈ నేపథ్యంలో వాషింగ్టన్ సుందర్‌ను జట్టులోకి తెచ్చే ప్రయత్నం జరుగుతోంది. సుందర్‌కు చెన్నై కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ తో పాత అనుబంధం ఉంది. Rising Pune Supergiants టీం ఉన్న సమయంలో వీరిద్దరూ కలిసి పనిచేశారు. IPL 2025 వేలంలో సుందర్‌ను గుజరాత్ టైటాన్స్ రూ.3.2 కోట్లు చెల్లించి కొనుగోలు చేసింది. అతను ఆ సీజన్‌లో కేవలం ఆరు మ్యాచ్‌ల్లో మాత్రమే ఆడినప్పటికీ.. ఇటీవల భారత జట్టుతో చూపిస్తున్న అద్భుత ఫామ్ అతని విలువను మరింత పెంచింది.
World’s Largest Banks: ప్రపంచంలోని 10 అతిపెద్ద బ్యాంకులు ఇవే.. లిస్ట్ లో ఈ భారతీయ బ్యాంకు కూడా
చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య మరో సంచలన ట్రేడ్ చర్చలు కూడా కొనసాగుతున్నాయి. సంజు శాంసన్ ను చెన్నై సూపర్ కింగ్స్‌కి ఇవ్వడం.. దాని బదులుగా రవీంద్ర జడేజా, సామ్ కరన్ ను రాజస్థాన్ రాయల్స్‌కి పంపించే ప్రతిపాదనపై చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. CSK అధికారిక ప్రతినిధి ఓ ప్రముఖ మీడియాతో మాట్లాడుతూ.. “సంజును మా జట్టులోకి తీసుకురావాలనే ఆసక్తి ఉంది. మేము మా ఆసక్తిని ఇప్పటికే RRకి తెలియజేశాము. వారు ప్రస్తుతం ఆ ప్రతిపాదనపై ఆలోచిస్తున్నారు. మేము సంజు CSK తరపున ఆడతాడని ఆశిస్తున్నాం అని పేర్కొన్నారు.
సంజు శాంసన్ IPLలో ఎక్కువకాలం రాజస్థాన్ రాయల్స్‌కే ప్రాతినిధ్యం వహించాడు. IPL 2021 నుంచి రాయల్స్‌కు కెప్టెన్‌గా ఉన్న శాంసన్, ఈ ఏడాది సీజన్ ముగిసిన తర్వాత కొత్త మార్పు కోసం ఆసక్తి చూపిస్తూ జట్టును విడిచిపెట్టాలనే సంకేతాలు ఇచ్చాడు. మరోవైపు రవీంద్ర జడేజా మొదటిసారిగా 2008లో RR తరపున IPL ఆడినప్పటికీ, ఎక్కువ భాగం తన కెరీర్‌ను చెన్నై సూపర్ కింగ్స్‌కే అంకితం చేశాడు. అతను CSK తరపున కీలక ఆటగాడిగా రాణించడమే కాకుండా MS ధోని కెప్టెన్సీ నుంచి తప్పుకున్న తర్వాత 2022 సీజన్‌లో కెప్టెన్‌గా కూడా వ్యవహరించాడు. ఇక 27 ఏళ్ల ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ సామ్ కరన్ కూడా గతంలో CSK తరపున ఆడాడు. ప్రస్తుతం ఆయన పంజాబ్ కింగ్స్ జట్టులో ఉన్నప్పటికీ, రాబోయే ట్రేడ్ విండోలో మళ్లీ మార్పు జరిగే అవకాశం ఉంది. ఈ మార్పులతో IPL 2026 ట్రేడ్ మార్కెట్ మరింత ఉత్కంఠభరితంగా మారుతుంది.
