SRH Vs RCB: తడబడ్డా.. నిలబడిన సన్‌రైజర్స్.. 201 పరుగులు చేసిన ఆరెంజ్ ఆర్మీ..
- ఇషాన్ కిషన్ కెప్టెన్సీ ఇన్నింగ్స్..
- లాస్ట్ లో మెరుపులు మెరిపించిన అనికేత్ వర్మ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరుగుతున్న ఐపీఎల్ 2026 ప్రారంభ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు కాస్త తడబడ్డారు. నిర్ణీత 20 ఓవర్లు ముగిసే సమయానికి హైదరాబాద్ జట్టు 9 వికెట్ల నష్టానికి 201 పరుగుల స్కోరును సాధించి.. డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ముందు 202 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్‌కు ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్ అభిషేక్ వర్మ త్వరగానే అవుట్ కావడంతో జట్టు కష్టాల్లో పడింది. అయితే.. కెప్టెన్ ఇషాన్ కిషన్ బాధ్యతాయుతంగా ఆడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. అతనికి హెన్రిచ్ క్లాసెన్ జతకలవడంతో ఇన్నింగ్స్ ఊపందుకుంది.
Also Read
- Priyanka Gandhi: ‘మహిళలకు భద్రత లేకపోతే ఎన్ని పథకాలు పెడితే ఏం లాభం?’.. బీహార్, ఢిల్లీ ఘటనలపై ప్రియాంక గాంధీ ఆవేదన
- Minister Keerthana Health Controversy: మంత్రి కీర్తన లండన్ వెళ్లకపోవడంపై వివాదం.. అసలు కారణం ఇదేనా?
- Success Story: యూపీఎస్సీ కోసం 16 ప్రభుత్వ ఉద్యోగాలను తిరస్కరించింది.. కట్ చేస్తే ఐపీఎస్..
- Trump: ‘మీరు ఇక్కడ ఉండకూడదు’.. యూఎన్‌లో ఓ రిపోర్టర్‌పై ట్రంప్ ఫైర్
కీలక భాగస్వామ్యం..
నాలుగో వికెట్‌కు ఇషాన్ కిషన్ మరియు క్లాసెన్ (31) జోడి కేవలం 53 బంతుల్లోనే 97 పరుగుల మెరుపు భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ జోడి ఆర్సీబీ బౌలర్లపై విరుచుకుపడటంతో సన్‌రైజర్స్ భారీ స్కోరు దిశగా సాగింది.
క్లాసెన్ అవుట్ – వివాదం..
వరుస సిక్సర్లతో హోరెత్తించిన క్లాసెన్ 14వ ఓవర్‌లో వివాదాస్పద రీతిలో అవుట్ అయ్యాడు. రొమారియో షెపర్డ్ బౌలింగ్‌లో ఫిల్ సాల్ట్ పట్టిన క్యాచ్‌పై సందేహాలు వ్యక్తమయ్యాయి. సాల్ట్ కాలు బౌండరీ రోప్‌ను తాకినట్లు కనిపించినా, థర్డ్ అంపైర్ మాత్రం అవుట్ అని ప్రకటించారు. దీంతో తీవ్ర అసంతృప్తితో క్లాసెన్ పెవిలియన్ చేరాడు.
@SunRisers Did Decent Total 201/9@RCBTweets Target is 202.@IPL #IPLIndia #TATAIPL #IPL2026 #SRHvsRCB pic.twitter.com/EIW8CZoXYP
— Ram kumar (@RAESC2828) March 28, 2026
కిషన్ కెప్టెన్ ఇన్నింగ్స్ – అద్భుత క్యాచ్..
సెంచరీ దిశగా దూసుకుపోతున్న ఇషాన్ కిషన్ 38 బంతుల్లో 80 పరుగులు (8 ఫోర్లు, 5 సిక్సర్లు) చేసి ఫిల్ సాల్ట్ పట్టిన అద్భుత క్యాచ్‌కు అవుట్ అయ్యాడు. అభినందన్ వేసిన ఫుల్ టాస్ బంతిని కిషన్ బలంగా బాదగా.. పాయింట్ వద్ద సాల్ట్ గాల్లోకి డైవ్ చేస్తూ ఒంటిచేత్తో కళ్లు చెదిరే క్యాచ్ అందుకున్నాడు. చివర్లో సలీల్ అరోరా (9) వంటి వారు తక్కువ పరుగులకే పరిమితమైనా.. అనికేత్ వర్మ కేవలం 18 బంతుల్లోనే 43 పరుగులు చేసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. మిగిలిన బ్యాటర్లు కూడా రాణించడంతో హైదరాబాద్ జట్టు 201 పరుగుల గౌరవప్రదమైన స్కోరును అందుకుంది.
ఆర్సీబీ బౌలింగ్: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున అరంగేట్రం చేసిన జేకబ్ డఫీ అద్భుతంగా బౌలింగ్ చేసి, 4 ఓవర్లలో కేవలం 22 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. మరో బౌలర్ రొమారియో షెపర్డ్ కూడా 3 వికెట్లు తీసినప్పటికీ, 54 పరుగులు సమర్పించుకున్నాడు.
తాజావార్తలు
-
Jadal Look: “మీమ్ మెటీరియల్ అవుతానేమో అని భయపడ్డా”.. ‘ది ప్యారడైజ్’ లుక్‌పై నాని షాకింగ్ కామెంట్స్!
-
Priyanka Gandhi: ‘మహిళలకు భద్రత లేకపోతే ఎన్ని పథకాలు పెడితే ఏం లాభం?’.. బీహార్, ఢిల్లీ ఘటనలపై ప్రియాంక గాంధీ ఆవేదన
-
Minister Keerthana Health Controversy: మంత్రి కీర్తన లండన్ వెళ్లకపోవడంపై వివాదం.. అసలు కారణం ఇదేనా?
-
Success Story: యూపీఎస్సీ కోసం 16 ప్రభుత్వ ఉద్యోగాలను తిరస్కరించింది.. కట్ చేస్తే ఐపీఎస్..
-
Trump: ‘మీరు ఇక్కడ ఉండకూడదు’.. యూఎన్‌లో ఓ రిపోర్టర్‌పై ట్రంప్ ఫైర్
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!