BCCI-IPL 2026: తొలి మ్యాచ్‌కు ముందు బీసీసీఐ సంచలన నిర్ణయం.. ఈ సీజన్లో కీలక మార్పు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BCCI Cancels IPL 2026 Opening Ceremony Ahead of RCB vs SRH Match: ఐపీఎల్ 19వ సీజన్ ప్రారంభానికి ముందు కీలక అప్డేట్ వెలువడింది. ఈ సీజన్ మార్చి 28న ప్రారంభం కానుంది. అయితే, టోర్నమెంట్ స్టార్ట్ అయ్యే రెండు రోజుల ముందు బీసీసీఐ సంచలన నిర్ణయం తీసుకుంది. సాధారణంగా ఐపీఎల్ తొలి మ్యాచ్‌లో ప్రారంభ వేడుక (Opening Ceremony) నిర్వహిస్తారు. కానీ.. ఈ సారి ఓపెనింగ్ సెర్మనీ నిర్వహించకూడదని బీసీసీఐ నిర్ణయించింది. ఆర్సీబీ, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగే మ్యాచ్‌కు ముందు ఎలాంటి వేడుకలూ జరగవని స్పష్టం చేసింది. ప్రతి సీజన్లో ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్‌కు ముందు ఓ వేడుక జరుగుతుంది. ఈ వేడుకకు ప్రముఖ నటులు, గాయకులు, నృత్యకారులు ప్రదర్శన ఇస్తారు. కానీ.. ఈ సారి వీటన్నింటికీ బ్రేక్ పడనుంది. గతేడాది ఆర్సీబీ విజయోత్స వేడుకలో తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నారు.
READ MORE: Form 16: శాలరీడ్ ఉద్యోగులకు అలర్ట్.. ఫారమ్ 16 ఇకపై ఉండదు.. ఏప్రిల్ 1 నుండి మారనున్న ITR నిబంధనలు
Also Read
ఇదిలా ఉండగా.. ఐపీఎల్ 2025లో ఆర్సీబీ జట్టు 17 ఏళ్ల కరువును ముగించి తన మొదటి టైటిల్‌ను గెలుచుకుంది. ఈ విజయాన్ని పురస్కరించుకుని ఆర్సీబీ చిన్నస్వామి స్టేడియంలో ఒక భారీ కార్యక్రమాన్ని నిర్వహించింది. విజయోత్సవాల సమయంలో చిన్నస్వామి స్టేడియం వెలుపల తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో 11 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఆ తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన 11 మందికి నివాళులర్పించేందుకు ఈసారి ఆర్సీబీ ప్రారంభ మ్యాచ్‌కు ముందు ఒక నిమిషం మౌనం పాటించాలని నిర్ణయించింది. అదే సమయంలో వారి జ్ఞాపకార్థం స్టేడియంలోని 11 సీట్లు శాశ్వతంగా ఖాళీగా ఉంచనున్నారు. ఇక మరోవైపు.. ఐపీఎల్ 2026 తొలి మ్యాచ్ బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియంలో జరగనుంది. మార్చి 28న ఈ వేదికపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి. ఈ సీజన్లో తమ టైటిల్‌ను కాపాడుకోవాలని బెంగళూరు లక్ష్యంగా పెట్టుకోగా, సన్‌రైజర్స్ హైదరాబాద్ ఈ సీజన్లో తమ రెండో టైటిల్‌పై కన్నేసింది.
READ MORE: Form 16: శాలరీడ్ ఉద్యోగులకు అలర్ట్.. ఫారమ్ 16 ఇకపై ఉండదు.. ఏప్రిల్ 1 నుండి మారనున్న ITR నిబంధనలు
తాజావార్తలు
-
Flydubai: పైలట్ స్మిత్ మచ్చర్ ఆరోగ్యంపై భారత ఎంబసీ కీలక ప్రకటన
-
Flydubai Attack: విమానాన్ని కూల్చాలనుకున్న ఒమన్ పైలట్.. ఇజ్రాయిల్‌కు అప్పగింతపై ట్విస్ట్!
-
Sundeep Kishan: ‘సిగ్మా’పై కుట్రల వెనకుండి నడిపిస్తున్నది ఎవరో తెలుసు.. దొరికిపోతే మీకే ఎక్కువ నష్టం
-
CURE Act: రేపటి నుంచే CURE యాక్ట్.. హైదరాబాద్ పాలనలో బిగ్ ఛేంజ్
-
Nepal: నేపాల్‌లో మరో ఘోరం.. హిమపాతం కూలి 15 మంది మృతి
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?