IPL 2026: ఐపీఎల్ (IPL) తొలి ఛాంపియన్స్‌గా నిలిచిన రాజస్థాన్ రాయల్స్ (RR) జట్టు తాజాగా కీలక ప్రకటన చేసింది. శ్రీలంక మాజీ క్రికెటర్ కుమార సంగక్కరను తమ జట్టుకు హెడ్ కోచ్‌గా తిరిగి నియమించినట్లు ప్రకటించింది. గతంలో ఐపీఎల్ 2025 సీజన్‌లో రాహుల్ ద్రవిడ్ హెడ్ కోచ్‌గా ఉన్నప్పుడు.. సంగక్కర రాయల్స్ ‘డైరెక్టర్ ఆఫ్ క్రికెట్’ పదవిలో కొనసాగారు. అలాగే సంగక్కర గతంలో 2021 నుంచి 2024 వరకు రాయల్స్‌కు హెడ్ కోచ్‌గా పనిచేశారు. ఇప్పుడు 2026 సీజన్‌లో జట్టుకు రెండో ఐపీఎల్ టైటిల్‌ను అందించే బాధ్యతను ఆయనకు బాధ్యతలు తిరిగి అప్పగించారు.
Nag Ashwin : సింగీతం దర్శకత్వంలో నాగ్ అశ్విన్ సినిమా?
అలాగే టీం కోచింగ్ సిబ్బందిలో కూడా కొన్ని మార్పులు జరిగాయి. విక్రమ్ రాథోర్ లీడ్ అసిస్టెంట్ కోచ్‌గా తిరిగి వచ్చారు. ట్రెవర్ పెన్నీ అసిస్టెంట్ కోచ్ గా, సిద్ లాహిరి పెర్ఫార్మెన్స్ కోచ్‌గా తమ పాత్రలను తిరిగి చేపట్టనున్నారు. న్యూజిలాండ్ మాజీ పేసర్ షేన్ బాండ్ ఫాస్ట్ బౌలింగ్ కోచ్‌గా కొనసాగనున్నారు. ఇకపోతే ఐపీఎల్ 2025 సీజన్ రాజస్థాన్ రాయల్స్‌కు అంతగా కలిసి రాలేదు. మెగా వేలం కారణంగా.. ఫ్రాంచైజీ జోస్ బట్లర్, అశ్విన్, యుజ్వేంద్ర చాహల్, ట్రెంట్ బౌల్ట్ వంటి కీలక ఆటగాళ్లను వదులుకుంది. దీనితో జట్టు సగం బలాన్ని కోల్పోయినట్లయింది. 2022, 2024 లో టైటిల్ ఫేవరెట్‌గా కనిపించిన ఈ జట్టు ఐపీఎల్ 2025 స్టాండింగ్స్‌లో తొమ్మిదో స్థానంలో నిలిచింది. దీంతో ఐపీఎల్ 2026 సీజన్‌లో మంచి కం బ్యాక్ ఇవ్వాలని రాయల్స్ ఆశిస్తోంది.
Ibomma: మీ దేశంలో పర్మనెంట్ గా మూసేస్తున్నాం.. ఐబొమ్మ మెసేజ్!
ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు కెప్టెన్ సంజు శాంసన్‌ను కూడా రాయల్స్ రిలీజ్ చేసింది. దీంతో ఈ సీజన్‌కు ముందు జట్టు తమ కొత్త సారథిని ప్రకటించాల్సి ఉంది. తాజా నివేదికల ప్రకారం భారత స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా జట్టు కెప్టెన్‌గా ఎంపికయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. కెరీర్ చివరి దశలో ఉన్న జడేజా తన అనుభవం మొత్తాన్ని జట్టుకు ఇచ్చి రాయల్స్‌కు రెండో ఐపీఎల్ టైటిల్‌ను అందించడానికి కృషి చేస్తారని జట్టు ఆశిస్తోంది. జట్టులో కొత్తగా చేరిన రవీంద్ర జడేజా, సామ్ కరన్, డోనోవన్ ఫెరీరా వంటి కీలక ఆటగాళ్లతో 2026లో మెరుగైన ప్రదర్శన ఇవ్వాలని రాజస్థాన్ రాయల్స్ భావిస్తోంది.
𝑯𝒆𝒂𝒅 𝑪𝒐𝒂𝒄𝒉 𝒌𝒂 𝑯𝒖𝒌𝒖𝒎 🔥 pic.twitter.com/VDiZ3pLswD
— Rajasthan Royals (@rajasthanroyals) November 17, 2025
