IPL 2026: హార్దిక్ పాండ్యా, టిమ్ డేవిడ్‌ లపై కన్నెర్ర.. భారీ జరిమానాతో పాటు..?

  • IPL 2026లో నియమావళి ఉల్లంఘనలపై కఠిన చర్యలు
  • టిమ్ డేవిడ్ పై మ్యాచ్ ఫీజులో 25% జరిమానా, 1 డీమేరిట్ పాయింట్
  • ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యపై కూడా
  • కెప్టెన్‌గా స్లో ఓవర్ రేట్ కారణంగా చర్య
  • రూ.12 లక్షల జరిమానా...
Ipl 2026

Ipl 2026

IPL 2026: ఐపీఎల్ 2026లో నియమావళి ఉల్లంఘనలపై ఐపీఎల్ అధికారులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఇకపోతే తాజాగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడుతున్న టిమ్ డేవిడ్ (Tim David) పై మ్యాచ్ ఫీజులో 25% జరిమానా విధించడంతో పాటు ఒక డీమేరిట్ పాయింట్ కూడా విధించారు. ఆదివారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అంపైర్ల ఆదేశాలను పాటించకపోవడంతో ఈ చర్యలు తీసుకున్నారు.

ఒక్కసారి ఛార్జ్ చేస్తే 320 కి.మీ రేంజ్​.. OLA ‘S1 X+’ లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా..!

ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌లోని ఆర్టికల్ 2.4 ప్రకారం ఈ ఉల్లంఘనగా పరిగణించారు. మ్యాచ్‌లో 18వ ఓవర్ సమయంలో అంపైర్లు బంతిని మార్చాలని నిర్ణయించినప్పుడు, టిమ్ డేవిడ్ బంతిని వెంటనే ఇవ్వకుండా ఆలస్యం చేశారు. అంపైర్లు పలుమార్లు కోరినా కూడా వెంటనే స్పందించలేదు. అదే విధంగా చివరి ఓవర్‌లో కూడా ఇలాంటి ఘటన మళ్లీ చోటుచేసుకోవడంతో ఇది పునరావృత ఉల్లంఘనగా పరిగణించారు. ఈ చర్యపై టిమ్ డేవిడ్ తన తప్పును అంగీకరించడంతో శిక్షను ఖరారు చేశారు.

430 సీసీ కెమెరాలు, 2000 పోలీసుల గస్తీ మధ్య ఉప్పల్ వేదికగా SRH vs RR మ్యాచ్..!

మ్యాచ్ సమయంలో ఈ ఘటన సరదాగా జరిగినట్లు కనిపించినప్పటికీ, నియమావళి ప్రకారం ఇది తప్పుగా పరిగణించబడింది. బంతితో ఆటపట్టించడం ఆటగాళ్లు, అభిమానుల్లో కొంత నవ్వు పుట్టించినా, అధికారికంగా ఇది ఉల్లంఘనగానే నమోదు అయింది. ఇక మరోవైపు ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యపై కూడా చర్యలు తీసుకున్నారు. జట్టు స్లో ఓవర్ రేట్ కొనసాగించినందుకు ఆయనపై రూ.12 లక్షల జరిమానా విధించారు. ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌లోని ఆర్టికల్ 2.22 ప్రకారం ఇది ఈ సీజన్‌లో తొలి తప్పిదం కావడంతో కేవలం ఆర్థిక జరిమానాతోనే పరిమితం చేశారు.