Aakash Chopra: “కోట్లు పెట్టి కొంటే హ్యాండ్ ఇస్తారా?”.. ఐపీఎల్లో విదేశీ ప్లేయర్స్ తీరుపై ఆకాష్ చోప్రా ఫైర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Aakash Chopra: ఐపీఎల్ మరో వారం రోజుల్లో ప్రారంభం కానుంది. అప్పటికే అన్ని జట్లు సిద్ధమయ్యాయి. ఇక ఓ అంశం మాత్రం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఆస్ట్రేలియాకు చెందిన బౌలర్లు ఒక్కొక్కరిగా ఐపీఎల్‌కు దూరమవుతున్నారు. దీంతో కోట్లు పెట్టి కొనుగోలు చేసిన ఫ్రాంచైజీలు ఆందోళనకు గురవుతున్నాయి. సన్‌రైజర్స్ రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమిన్స్ ఇప్పటికే దూరమయ్యాడు. ఇషాన్ కిషన్‌ను తమ కెప్టెన్‌గా టీమ్ నియమించింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు చెందిన జోష్ హేజిల్‌వుడ్ గాయం కారణంగా టోర్నమెంట్ ప్రారంభానికి దూరమవ్వనున్నాడు. ఇప్పుడు, ఢిల్లీ క్యాపిటల్స్‌కు చెందిన మిచెల్ స్టార్క్ సైతం ఐపీఎల్ 2026 ప్రారంభానికి అందుబాటులో ఉండడు. ఇలా వరుసగా స్టార్ ప్లేయర్స్ దూరమవుతుండంపై తాజాగా మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా ఫైర్ అయ్యారు. మిచెల్ స్టార్క్ సీజన్ ఆరంభ మ్యాచ్‌లకు అందుబాటులో ఉండటం లేదని తెలిసిందన్నారు. ఇప్పటికే జోష్ హాజిల్‌వుడ్, పాట్ కమిన్స్‌లు దూరమయ్యారని.. తాజాగా స్టార్క్ గాయంతో బాధపడుతున్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా పేర్కొందన్నారు. కానీ నిజానికి అతను ఫిట్‌గా ఉన్నప్పటికీ సీఏ మాత్రం ఏవో సాకులు చెప్పి అతన్ని ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడకుండా చూస్తుందని ఆరోపించారు. స్టార్క్ టీ20 క్రికెట్‌కు ఎప్పుడో వీడ్కోలు పలికాడని గుర్తు చేశారు. మరి రెండు నెలలుగా స్టార్క్ విషయంలో క్రికెట్ ఆస్ట్రేలియా ఏం చేసినట్లు? అని నిలదీశారు.
READ MORE: Danam Nagender : దానం నాగేందర్ ‘క్లీన్ చిట్’పై హైకోర్టులో సవాల్
Also Read
“ఆస్ట్రేలియా క్రికెట్ ఎందుకు ఇలా ప్రవర్తిస్తుందో అర్థం కావడం లేదు. మరోవైపు న్యూజిలాండ్ బౌలర్ లోకీ ఫెర్గూసన్ సైతం దూరమయ్యాడు. ఫెర్గూసన్ కుటుంబంతో గడిపపేందుకు తొలి ఏడు మ్యాచులకు రాకపోవడం దారుణం.. ప్రెసెంట్ అతను సౌతాఫ్రికాతో 20 సిరీస్‌లు అడుతున్నాడు. ఇది అయిపోగానే వెంటనే కుటుంబంతో గడిపేందుకు వెళ్తాడట. అది అతడి వ్యక్తిగతం కానీ.. అతన్ని రూ. 2 కోట్లకు కొనుగోలు చేశారు. ఏడు మ్యాచుల తర్వాత వచ్చి రూ.కోటి తీసుకుని వెళ్లిపోతాడు. ఐపీఎల్లో మాట ఇచ్చి ఏడు మ్యాచ్‌లకు దూరమైతే, టీమ్‌లు ఏం చేయాలి? ఇది సరైన నిర్ణయం కాదు.. జట్టు తీవ్రంగా నష్టపోతుంది.” అని ఆకాష్ చోప్రా వెల్లడించారు. ఇదిలా ఉండగా.. సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్‌లో పాట్ కమిన్స్ లేని లోటు స్పష్టంగా కనిపించనుంది. ఢిల్లీ క్యాపిటల్స్‌లో మిచెల్ స్టార్క్ లేని లోటును పూడ్చేందుకు లుంగీ ఎన్గిడి లేదా కైల్ జేమీసన్ వంటి బౌలర్లపై ఆధారపడాల్సి వస్తుంది. చెన్నై సూపర్ కింగ్స్ లో నాథన్ ఎల్లిస్ గాయం కారణంగా టోర్నీ మొత్తానికి దూరమవ్వడం సీఎస్కేకు పెద్ద దెబ్బగా మారనుంది. లక్నో సూపర్ జెయింట్స్ లో వానిందు హసరంగ సైతం గాయంతో బాధపడుతుండటంతో ఆ జట్టు స్పిన్ విభాగంపై ఆందోళన నెలకొంది. విదేశీ ఆటగాళ్ల ఈ తరహా నిర్ణయాల వల్ల ఐపీఎల్ ఫ్రాంచైజీలు భవిష్యత్తులో ఆటగాళ్లను ఎంచుకునేటప్పుడు పునరాలోచించుకోవాల్సిన అవసరం ఉంది.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?