Site icon NTV Telugu

IPL 2026 Auction: ఆ రోజే ఐపీఎల్ 2026 వేలం! ఎక్కడ జరుగుతుందంటే..

Ipl 2026 Auction

Ipl 2026 Auction

IPL 2026 Auction: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)… క్రికెట్ అభిమానుల్లో దీనికి ఒక ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉందంటే అతిశయోక్తి కాదు. రాత్రికి రాత్రే ఒక ఆటగాడు స్టార్‌గా మారే అవకాశం ఐపీఎల్‌లో ఉంటుంది. అలాగే ఒక స్టార్ క్రికెట్ రాత్రికి రాత్రికే జీరో అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. తాజాగా ఐపీఎల్‌కు సంబంధించిన ఒక అప్డేట్ వచ్చింది. అది ఏమిటంటే.. వాస్తవానికి ఐపీఎల్ 2026 కి ముందు జరిగే వేలంలో ఆటగాళ్ల భవితవ్యం ఏమిటి అనేది తెలుస్తుంది. ఈసారి నిర్వహించేది చిన్న వేలం. ఈ వేలం ఎప్పుడు, ఎక్కడ జరుగుతుందనే దానిపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం ఏమిటో ఈ స్టోరీలో తెలుసుకుందాం..

READ ALSO: True 8K వీడియో రికార్డింగ్, AI ఆధారిత ఎడిటింగ్, క్లౌడ్ స్టోరేజ్ వంటి ఫీచర్లతో MAX2 ప్రొఫెషనల్ కెమెరా లాంచ్..!

విదేశాలలో IPL 2026 వేలం
IPL 2026 వేలం విదేశాలలో జరుగనుంది. భారతదేశం వెలుపల వేలం జరగడం ఇది వరుసగా మూడవసారి. గతంలో 2023 లో దుబాయ్‌లో, 2024 లో సౌదీ అరేబియాలోని జెడ్డాలో జరిగింది. ఐపీఎల్ 2026 వేలం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాజధాని అబుదాబిలో జరుగనుందని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. గత సంవత్సరం సౌదీ అరేబియాలో జరిగిన మెగా వేలం తర్వాత, ఈసారి మినీ వేలం జరగనుంది. “వేలం వేదికగా అబుదాబిని ఎంపిక చేశారు” అని బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు పేర్కొన్నారని పలు నివేదికలు పేర్కొన్నాయి. ఈ నివేదికల ప్రకారం.. డిసెంబర్ 15 లేదా 16న వేలం జరిగే అవకాశం ఉంది. వాస్తవానికి ఐపీఎల్ వేలం ఎల్లప్పుడూ ఉత్కంఠభరితంగా ఉంటుంది. అభిమానులు తమ అభిమాన జట్టు ఏ ఆటగాడిని పొందుతుందో అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ వేలానికి ముందు ట్రేడ్ విండో కూడా తెరిచి ఉంటుంది, ఇది ఆటగాళ్ల మార్పిడికి వీలు కల్పిస్తుంది. అయితే ఈ విండో కూడా వేలానికి ఏడు రోజుల ముందు క్లోజ్ అవుతుంది.

IPL 2026 మెగా వేలానికి ముందు ఒక ప్రధాన ట్రేడ్ విండోలో గణనీయమైన మార్పు కనిపించవచ్చు. పలు నివేదికల ప్రకారం.. రవీంద్ర జడేజా, సామ్ కుర్రాన్‌లకు బదులుగా సంజు సామ్సన్‌తో ఒప్పందం దాదాపుగా ఖరారు అయింది. వేలానికి ముందు సంజు సామ్సన్ చెన్నై సూపర్ కింగ్స్‌లో చేరవచ్చు. ఇదే సమయంలో రవీంద్ర జడేజా, సామ్ కుర్రాన్ రాజస్థాన్ రాయల్స్‌లోకి మారే అవకాశం ఉంది. ట్రేడ్ విండో అంటే ఏదైనా IPL ఫ్రాంచైజ్ మరొక ఫ్రాంచైజీతో ఆటగాళ్లను మార్పిడి చేసుకునే సమయం. 10 జట్లూ తమ బలహీనమైన లింకులను బలోపేతం చేసుకోవడానికి ఈ విండోను ఉపయోగిస్తాయి. ఈ విండో IPL సీజన్ ముగిసిన సరిగ్గా ఏడు రోజుల తర్వాత తెరుచుకుంటుంది, అలాగే వేలానికి ఏడు రోజుల ముందు ముగుస్తుంది.

READ ALSO: Ketu Moon Eclipse: రేపు కేతు-చంద్ర గ్రహణం.. ఈ 3 రాశుల వారు జాగ్రత్త..

Exit mobile version