Site icon NTV Telugu

IPL 2026-CSK: ఐపీఎల్ 2026 ముందు చెన్నై నుంచి ఐదుగురు అవుట్.. లిస్టులో స్టార్ ప్లేయర్స్!

Ipl 2026 Csk

Ipl 2026 Csk

ఐపీఎల్ 2026 వేలం డిసెంబర్ రెండవ లేదా మూడవ వారంలో జరిగే అవకాశం ఉంది. డిసెంబర్ 13-15 వరకు జరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఫ్రాంచైజీ అధికారులు బీసీసీఐతో చర్చలు జరుపుతున్న క్రిక్‌బజ్‌ తమ కథనంలో పేర్కొంది. ఐపీఎల్ పాలక మండలి ఐపీఎల్ 2026కు సంబంధించిన షెడ్యూల్‌ను ఇంకా ఫిక్స్ చేయలేదు. వేలంకు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో ఐపీఎల్ 2025లో చివరి స్థానంలో నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే).. 2026 వేలానికి ముందు కఠిన నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఐదుసార్లు ఛాంపియన్లుగా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ తమ జట్టును పునర్నిర్మించడానికి 5 మంది ఆటగాళ్లను విడుదల చేయాలని చూస్తున్నట్లు సమాచారం. చెన్నై విడుదల చేసే ఆటగాళ్ల జాబితాలో దీపక్ హుడా ముందువరసలో ఉన్నాడట. విజయ్ శంకర్, రాహుల్ త్రిపాఠి, సామ్ కర్రన్‌, డెవాన్ కాన్వే కూడా ఉన్నట్లు తెలుస్తోంది. వీరందరూ ఐపీఎల్ 2025లో దారుణంగా విఫలమయ్యారు. ముఖ్యంగా భారీ ధర పెట్టి కొనుగోలు చేసిన కర్రన్‌, కాన్వేలు పూర్తిగా నిరాశపర్చారు. జట్టులో ఇప్పటికే రచిన్ రవింద, ఆయుష్ మాత్రే వంటి మంచి ఓపెనర్లు ఉన్నారు. రుతురాజ్ గైక్వాడ్ తిరిగి రావడంతో కాన్వే కొనసాగడం కష్టమే.

రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్‌ను తీసుకోవడానికి చెన్నై సూపర్ కింగ్స్ ప్రాంచైజీ యాజమాన్యం గట్టిగా ప్రయత్నాలు చేస్తోందట. ఒకవేళ సంజు జట్టులోకి వస్తే కెప్టెన్సీ అతడికే దక్కే అవకాశాలు ఉన్నాయి. టి నటరాజన్, మిచెల్ స్టార్క్, ఆకాష్ దీప్, మయాంక్ యాదవ్, డేవిడ్ మిల్లర్ వంటి ఆటగాళ్లు చెన్నైకి మంచి ఆప్షన్ అనే చెప్పాలి. ఎంఎస్ ధోనీ, రచిన్ రవింద, రుతురాజ్ గైక్వాడ్, ఆయుష్ మాత్రే, షేక్ రషీద్, రచిన్ రవీంద్ర, అన్షుల్ కాంబోజ్, ముఖేష్ చౌదరి, మతీషా పతిరానాలు చెన్నైలో కొనసాగే అవకాశాలు ఉన్నాయి.

Exit mobile version