NTV Telugu Site icon

IPL 2025: ఐపీఎల్ షెడ్యూల్ రిలీజ్.. తొలి మ్యాచ్ ఆర్సీబీ-కేకేఆర్, ఫైనల్ మే 25

Ipl 2025 Dates

Ipl 2025 Dates

ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న క్రికెట్ అభిమానులకు ఐపీఎల్ నుంచి మంచి న్యూస్ అందింది. ఐపీఎల్ (IPL 2025) ఫుల్ షెడ్యూల్ రిలీజ్ అయింది. మార్చి 22న ఈడెన్ గార్డెన్స్‌లో డిఫెండింగ్ ఛాంపియన్స్ కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మధ్య తొలి మ్యాచ్ జరుగనుంది. మార్చి 23న ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య చెన్నై చెపాక్ స్టేడియంలో జరుగనుంది. మార్చి 23న తొలి డబుల్ హెడర్ మ్యాచ్ జరగనుంది. గత సీజన్ ఫైనలిస్ట్‌లైన సన్‌రైజర్స్ హైదరాబాద్.. హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్‌తో తలపడనుంది. 2025 సీజన్ ఫైనల్ మే 25న ఈడెన్ గార్డెన్స్‌లో జరుగుతుంది.

Read Also: Warangal: ఇంటర్ విద్యార్థినితో ఉపాధ్యాయుడి అసభ్య ప్రవర్తన.. కుటుంబీకుల ఆందోళన

మార్చి 9న ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ ముగిసిన 12 రోజుల తర్వాత.. ఐపీఎల్ 2025 సీజన్ ప్రారంభమవుతుంది. ఈ టోర్నమెంట్ 13 వేదికలలో జరుగుతుంది. గౌహతి (రాజస్థాన్ రాయల్స్‌కు రెండవ వేదిక), ధర్మశాల (పంజాబ్ కింగ్స్‌కు రెండవ వేదిక), వైజాగ్ (ఢిల్లీ క్యాపిటల్స్‌కు రెండవ హోమ్ వేదిక)గా ఉండనుంది. ఐపీఎల్ 2025లో 65 రోజుల పాటు మొత్తం 74 మ్యాచ్‌లు జరుగుతాయి. లీగ్ దశ మే 18న ముగుస్తుంది. ప్లేఆఫ్‌లు మే 20-25 వరకు జరుగుతాయి. 2025 సీజన్ ఫైనల్ మే 25న ఈడెన్ గార్డెన్స్‌లో జరుగుతుంది. అదే వేదికలో మే 23న క్వాలిఫైయర్ 2కు ఆతిథ్యం ఇస్తుంది.

Read Also: Top Headlines @5PM : టాప్‌ న్యూస్‌

ఎలిమినేటర్, క్వాలిఫయర్ 1 మ్యాచ్‌లు మే 20, 21 తేదీలలో హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో జరుగుతాయి. పంజాబ్ కింగ్స్ తమ మూడు హోం మ్యాచ్‌లను ధర్మశాలలో ఆడనుండగా.. మిగిలిన హోం మ్యాచ్‌లు పంజాబ్‌లోని ముల్లాన్‌పూర్‌లో ఆడనున్నాయి.