NTV Telugu Site icon

RCB vs DC: అదరగొడుతున్న ఆర్‌సీబీ.. డీసీ జైత్రయాత్ర! ఈరోజు గెలుపెవరిది?

Rcb Vs Dc Playing 11

Rcb Vs Dc Playing 11

ఐపీఎల్‌ 2025లో భాగంగా ఈరోజు చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఐపీఎల్‌ 2025లో డీసీ జైత్రయాత్ర కొనసాగుతోంది. ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌లలో గెలిచిన ఢిల్లీ.. మరో విజయంపై కన్నేసింది. మరోవైపు అద్భుత ఆటతో ఆర్‌సీబీ అదరగొడుతోంది. ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచ్‌లలో 3 గెలిచిన బెంగళూరు.. నాలుగో విజయం సాధించాలనే పట్టుదలతో ఉంది. ఇరు జట్లు జోరు మీదుండడంతో మ్యాచ్ రసవత్తరంగా సాగే అవకాశాలు ఉన్నాయి. రాత్రి 7:30 నుంచి స్టార్‌ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం కానుంది.

ఐపీఎల్‌ 2025లో ఆర్‌సీబీ కెప్టెన్‌ రజత్‌ పాటీదార్, స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కొహ్లీ ఫామ్ మీదున్నారు. ఇద్దరు అర్ధ శతకాలతో రాణిస్తున్నారు. ఇదే జోరు కొనసాగించాలని చుస్తున్నారు. దేవదత్‌ పడిక్కల్‌ గత మ్యాచ్‌లో మంచి ఇన్నింగ్స్‌ ఆడాడు. మిడిలార్డర్‌లో లియామ్ లివింగ్‌స్టోన్, జితేశ్‌ శర్మ, టిమ్‌ డేవిడ్‌ లాంటి హిట్టర్లు ఉన్నారు. బెంగళూరు బౌలింగ్‌ కూడా బాగానే ఉంది. పేస్ కోటాలో జోష్ హాజల్‌వుడ్, భువనేశ్వర్ కుమార్, యశ్‌ దయాళ్‌.. స్పిన్నర్లుగా కృనాల్‌ పాండ్యా, సుయాశ్‌ శర్మ రాణిస్తున్నారు.

ఢిల్లీ ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌.. మెక్‌గుర్క్‌తో కలిసి మెరుగైన ఆరంభాలు ఇస్తున్నాడు. వన్‌డౌన్‌లో అభిషేక్‌ పొరెల్‌ రెచ్చిపోతున్నాడు. అక్షర్‌ పటేల్, ట్రిస్టన్‌ స్టబ్స్, సమీర్‌ రిజ్వి, అశుతోష్‌ శర్మలతో మిడిలార్డర్‌ బాగుంది. మిచెల్ స్టార్క్, ముకేశ్‌ కుమార్, మోహిత్‌ శర్మ పేస్‌ బౌలింగ్‌ బాధ్యతలు మోయనున్నారు. అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, విప్రాజ్‌ నిగమ్‌తో స్పిన్‌ బలంగా ఉంది. విప్రాజ్‌పై భారీ ఆశలు ఉన్నాయి. బౌలింగ్‌లో అక్షర్ రాణిస్తే తిరుగుండదు.

Also Read: RCB VS DC: సెంచరీపై కన్నేసిన విరాట్.. ఒకే ఒక్క హాఫ్ సెంచరీ చాలు!

తుది జట్లు (అంచనా) :
బెంగళూరు: రజత్‌ పాటీదార్‌ (కెప్టెన్ ), ఫీల్ సాల్ట్, విరాట్ కోహ్లీ, దేవదత్‌ పడిక్కల్, లియామ్ లివింగ్‌స్టోన్, జితేశ్‌ శర్మ, టిమ్‌ డేవిడ్‌, కృనాల్‌ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, జోష్ హాజల్‌వుడ్, యశ్‌ దయాళ్, సుయాశ్‌ శర్మ.
ఢిల్లీ: మెక్‌గుర్క్, కేఎల్‌ రాహుల్, అభిషేక్‌ పొరెల్, అక్షర్‌ పటేల్‌ (కెప్టెన్ ), సమీర్‌ రిజ్వీ, స్టబ్స్, అశుతోష్‌ శర్మ, విప్రాజ్‌ నిగమ్, మిచెల్ స్టార్క్, కుల్దీప్ యాదవ్, మోహిత్ శర్మ, ముకేశ్‌ కుమార్‌.