RCB Captain: ఆర్సీబీకి కొత్త కెప్టెన్.. అస్సలు ఊహించలేరు!
- ఆర్సీబీకి కొత్త కెప్టెన్
- రజత్ పటీదార్‌కు కెప్టెన్సీ బాధ్యతలు
- విరాట్ కోహ్లీ జట్టులో ఉన్నప్పటికీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ప్రాంచైజీ కొత్త కెప్టెన్‌ను ప్రకటించింది. యువ బ్యాటర్ రజత్ పటీదార్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగిస్తూ ఆర్సీబీ మేనేజ్మెంట్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టింది. రజత్ పాటిదార్, కృనాల్ పాండ్యాలు ఆర్సీబీ కెప్టెన్ రేసులో ఉన్నట్లు కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే.
గత సీజన్లో జట్టుకు సారథ్యం వహించిన దక్షిణాఫ్రికా వెటరన్ ఆటగాడు ఫాఫ్ డుప్లెసిస్‌ను ఆర్సీబీ రిటైన్ చేసుకోలేదు. మెగా వేలంలో కూడా అతడిని తీసుకోలేదు. ఇక స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ జట్టులో ఉన్నప్పటికీ కెప్టెన్సీ వైపు మొగ్గు చూపలేదు. జట్టు భవిష్యత్తు అవసరాల దృష్ట్యా రజత్ పటీదార్‌కు ఆర్సీబీ మేనేజ్మెంట్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది. దాంతో ఆర్సీబీకి 8వ కెప్టెన్ అయ్యాడు 31 ఏళ్ల రజత్. 2021లో ఐపీఎల్లో అడుగు పెట్టిన రజత్.. ఇప్పటి వరకు 27 మ్యాచ్‌లు మాత్రమే ఆడి 34.74 సగటుతో 799 పరుగులు చేశాడు. ఇక 2023లో టీమిండియా తరఫున అరంగేట్రం చేసి ఇప్పటివరకు మూడు టెస్టులు, ఒక్క వన్డే మాత్రమే ఆడాడు.
Also Read
- IND Vs SL Test Free Entry: భారత్ - శ్రీలంక టెస్టు సిరీస్‌కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
- Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
- Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
- Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
ఆర్సీబీ జట్టుకు ఇప్పటివరకు 7 మంది కెప్టెన్సీ వహించారు. రాహుల్ ద్రవిడ్ (2008), కెవిన్ పీటర్సన్ (2009 – స్టాండ్‌ఇన్ కెప్టెన్), అనిల్ కుంబ్లే (2009-10), డానియల్ వెటోరీ (2011-12), విరాట్ కోహ్లీ (2011-2021, 2023 స్టాండ్‌ఇన్ కెప్టెన్), షేన్ వాట్సన్ (2017 – స్టాండ్‌ఇన్ కెప్టెన్), ఫాఫ్ డుప్లెసిస్ (2022-24)లు బెంగళూరు జట్టుకు బాధ్యతలు నిర్వర్తించారు. ఇప్పుడు రజత్ పటీదార్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టేందుకు సిద్దమయ్యాడు. రజత్ అయినా ఆర్సీబీకి కప్ అందిస్తాడేమో చూడాలి.
Welcome to your Raj, Ra-pa. 👑
The baton has been passed, and your name has made it to the history books.
It’s time for a new chapter! Let’s give the best fans in the world what they’ve been waiting for all these years. 🙌 #PlayBold #ನಮ್ಮRCB #RCBCaptain #Rajat #RajatPatidar… pic.twitter.com/AKwjM9bnsq
— Royal Challengers Bengaluru (@RCBTweets) February 13, 2025
తాజావార్తలు
-
IND Vs SL Test Free Entry: భారత్ – శ్రీలంక టెస్టు సిరీస్‌కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
-
Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
-
Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
-
Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
-
Dhurandhar : నెట్‌ఫ్లిక్స్‌లో ‘ధురంధర్’ ప్రపంచ రికార్డు..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!