Site icon NTV Telugu

RCB Record: ఆర్సీబీ అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే మొదటి టీమ్!

Rcb Record

Rcb Record

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) టీమ్ అరుదైన రికార్డు ఖాతాలో వేసుకుంది. ప్రత్యర్థి మైదానంలో వరుసగా ఆరు విజయాలు సాధించిన మొదటి జట్టుగా నిలిచింది. ఐపీఎల్ 2025లో భాగంగా ఆదివారం న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో విజయం సాధించడంతో ఆర్సీబీ ఖాతాలో ఈ రికార్డు చేరింది. ఐపీఎల్ చరిత్రలో ఇప్పటివరకు ఏ టీమ్ కూడా ఈ రికార్డును సాధించలేదు.

ఐపీఎల్‌ 2025లో ఆర్సీబీ ఇప్పటివరకు 10 మ్యాచ్‌లు ఆడింది. ఇందులో 7 విజయాలు, 3 ఓటములు ఉన్నాయి. ఏడు విజయాల్లో ఆరు విజయాలు ప్రత్యర్థి వేదికల్లోనే (బయటి వేదికల్లోనే) సాధించడం విశేషం. అంతేకాదు ఒకే సీజన్‌లో బయటి వేదికల్లో అత్యధిక విజయాలు సాధించడం ఆర్సీబీకి ఇది రెండోసారి. 2015లో విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో బయటి వేదికల్లో ఆడిన తొమ్మిది మ్యాచ్‌లలో ఆరు మ్యాచ్‌లను గెలిచింది. ప్రస్తుతం 7 మ్యాచ్‌లలోనే ఏకంగా 6 విజయాలు అందుకుంది. 2011, 2012లో ఐదు మ్యాచ్‌లను ఆర్సీబీ గెలిచింది.

ప్రస్తుతం ఆర్సీబీ పాయింట్ల పట్టికలో తొలి స్థానంలో ఉంది. ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచ్‌లలో 7 విజయాలతో 14 పాయింట్స్ ఖాతాలో వేసుకుంది. మిగిలిన నాలుగు మ్యాచ్‌ల్లో ఒక్కటి గెలిచినా.. అధికారిక ప్లేఆఫ్స్‌ బెర్తు దక్కించుకుంటుంది. ఆర్సీబీ ఫామ్ చూస్తే ఇదేమీ కష్టమేమి కాదు. నాలుగు మ్యాచుల్లో రెండు గెలిస్తే టాప్-2లో నిలవడం పక్కా. ఈసారైనా కప్ కొట్టాలని ఆర్సీబీ ఫాన్స్ బలంగా కోరుకుంటున్నారు.

Also Read: Sanjana Ganesan: నా కొడుకుతో మీకేంట్రా పని.. ఇచ్చి పడేసిన బుమ్రా వైఫ్!

ఒకే ఐపీఎల్ సీజన్‌లో బయట మైదానాల్లో ఆర్సీబీ అత్యధిక విజయాలు:
# 2015లో 6 విజయాలు (9 మ్యాచ్‌లు)
# 2025లో 6 విజయాలు (6 మ్యాచ్‌లు)
# 2011లో 5 విజయాలు (10 మ్యాచ్‌లు)
# 2012లో 5 విజయాలు (8 మ్యాచ్‌లు)

Exit mobile version