Site icon NTV Telugu

IPL 2025 Awards: ఐపీఎల్ విజేత ప్రైజ్‌మనీ ఎంతో తెలుసా.. అవార్డ్స్ ఫుల్ లిస్ట్ ఇదే!

Ipl 2025 Awards

Ipl 2025 Awards

18 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఐపీఎల్ విజేతగా నిలిచింది. మంగళవారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో పంజాబ్ కింగ్స్‌తో జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో 6 పరుగుల తేడాతో విజయం సాధించిన ఆర్సీబీ.. ఐపీఎల్ 2025 టైటిల్‌ను కైవసం చేసుకుంది. మూడు సార్లు ఫైనల్లో భంగపడ్డ బెంగళూరు.. నాలుగో ప్రయత్నంలో ట్రోఫీని ఒడిసి పట్టింది. ఆర్సీబీ ఐపీఎల్ విజేతగా నిలవడంతో అటు ప్లేయర్స్, ఇటు ఫాన్స్ సంబరాలు చేసుకున్నారు. ఇక ఐపీఎల్ 2025 విజేతగా నిలిచిన ఆర్సీబీకి రూ.20 కోట్ల ప్రైజ్‌మనీ దక్కింది.

ఐపీఎల్ 2025 రన్నరప్‌ పంజాబ్ కింగ్స్‌కు రూ.12.5 కోట్ల ప్రైజ్‌మనీ లభించింది. క్వాలిఫయర్స్‌ జట్టుకు రూ.7 కోట్లు, ఎలిమినేటర్‌ టీంకు రూ.6.5 కోట్ల చొప్పున ప్రైజ్‌మనీ దక్కింది. జట్లకు ఇచ్చే ప్రైజ్‌మనీతో పాటు ఇతర అవార్డులు కూడా ఉంటాయన్న విషయం తెలిసిందే. వీటిలో ఆరెంజ్ క్యాప్, పర్పుల్ క్యాప్, ఫెయిర్ ప్లే అవార్డు, ఫాంటసీ కింగ్ ఆఫ్ ది సీజన్, ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్, బెస్ట్ క్యాచ్, అత్యధిక సిక్సర్లు, మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్స్ వంటి అవార్డులు ఉంటాయి. అవార్డ్స్ ఫుల్ లిస్ట్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

Also Read: Virat Kohli IPL Trophy: ఐపీఎల్ కప్‌తో కోహ్లీ.. రచ్చ మాములుగా లేదుగా!

అవార్డ్స్ ఫుల్ లిస్ట్:
సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ది మ్యాచ్ – జితేష్ శర్మ (లక్ష రూపాయలు)
ఫాంటసీ కింగ్ ఆఫ్ ది మ్యాచ్ – శశాంక్ సింగ్ (లక్ష రూపాయలు)
ఫైనల్ మ్యాచ్‌లో సూపర్ సిక్సర్లు – శశాంక్ సింగ్ (లక్ష రూపాయలు)
ఫైనల్ మ్యాచ్ గ్రీన్ డాట్ బాల్స్ – కృనాల్ పాండ్య (లక్ష రూపాయలు)
ఫైనల్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ – కృనాల్ పాండ్య (రూ. 5 లక్షలు)
ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్ – సాయి సుదర్శన్ (రూ. 10 లక్షలు)
సీజన్‌ సూపర్ స్ట్రైకర్ – వైభవ్ సూర్యవంశీ (టాటా కర్వ్)
ఫాంటసీ కింగ్ ఆఫ్ ది సీజన్ – సాయి సుదర్శన్ (రూ. 10 లక్షలు)
సీజన్‌ సూపర్ సిక్స్‌లు – నికోలస్ పూరన్ (రూ. 10 లక్షలు)
సీజన్ గ్రీన్ డాట్ బాల్స్ – మొహమ్మద్ సిరాజ్ (రూ. 10 లక్షలు)
సీజన్‌ బెస్ట్ క్యాచ్ – కమిండు మెండిస్ (రూ. 10 లక్షలు)
సీజన్‌ ఫెయిర్ ప్లే అవార్డు – చెన్నై సూపర్ కింగ్స్ (ట్రోఫీ)
సీజన్‌ పర్పుల్ క్యాప్ – ప్రసిద్ధ్ కృష్ణ (రూ. 10 లక్షలు)
సీజన్‌ ఆరెంజ్ క్యాప్ – సాయి సుదర్శన్ (రూ. 10 లక్షలు
సీజన్‌ మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ – సూర్యకుమార్ యాదవ్ ( రూ. 15 లక్షలు)
సీజన్‌ బెస్ట్ పిచ్ అండ్ గ్రౌండ్ అవార్డు – ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ (రూ. 50 లక్షలు)

Exit mobile version