Site icon NTV Telugu

IPL 2025: రెండులో కోహ్లీ, హేజిల్‌వుడ్‌.. మూడులో ఆర్సీబీ!

Virat Kohli, Josh Hazlewood

Virat Kohli, Josh Hazlewood

ఐపీఎల్ 2025 మ్యాచులు రసవత్తరంగా సాగుతున్నాయి. అద్భుతమైన ఫామ్‌లో ఉన్న గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ చెరో 12 పాయింట్లతో పట్టికలో అగ్రస్థానంలో ఉన్నాయి. గురువారం రాత్రి చిన్నస్వామి స్టేడియంలో రాజస్థాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచులో గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కూడా ఆరో విజయంతో 12 పాయింట్స్ ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం పట్టికలో ఆర్సీబీ మూడో స్థానంలో ఉంది. ఈ మూడు టీమ్స్ మరో రెండు విజయాలు సాధిస్తే.. అధికారిక ప్లేఆఫ్స్ బెర్త్ దక్కించుకుంటాయి. రేసులో ముంబై, పంజాబ్, లక్నో కూడా ఉన్నాయి.

రాజస్థాన్‌ రాయల్స్‌పై హాఫ్ సెంచరీ (70; 42 బంతుల్లో 8×4, 2×6) చేసిన ఆర్సీబీ బ్యాటర్ విరాట్ ఆరెంజ్ క్యాప్ రేసులో ఎనిమిదో స్థానం నుండి రెండవ స్థానానికి చేరుకున్నాడు. విరాట్ 9 ఇన్నింగ్స్‌లలో 392 పరుగులు చేశాడు. గుజరాత్ టైటాన్స్ ఓపెనర్ సాయి సుదర్శన్ 8 ఇన్నింగ్స్‌లలో 417 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్‌ను కలిగి ఉన్నాడు. నికోలస్ పూరన్ 9 ఇన్నింగ్స్‌లలో 377 చేసి మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. సూర్యకుమార్ యాదవ్ (373), యశస్వి జైస్వాల్ (356) జోస్ బట్లర్‌ (356) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

Also Read: Gold Rate Today: గోల్డ్ లవర్స్‌కు గుడ్‌న్యూస్.. ఈరోజు తులం ఎంతుందంటే?

ఆర్సీబీ పేసర్ జోష్ హాజిల్‌వుడ్ రాజస్థాన్‌ రాయల్స్‌పై నాలుగు వికెట్లు తీసి పర్పుల్ క్యాప్ రేసులో రెండవ స్థానానికి చేరుకున్నాడు. హాజిల్‌వుడ్ 9 మ్యాచులలో 16 వికెట్స్ పడగొట్టాడు. ప్రసిద్ధ్ కృష్ణ 16 వికెట్లతో అగ్ర స్థానంలో ఉన్నాడు. కుల్దీప్ యాదవ్ (12), నూర్ అహ్మద్ (12), సాయి కిషోర్ (12) టాప్ 5లో కొనసాగుతున్నారు.

Exit mobile version