PBKS vs MI: బీసీసీఐ కీలక నిర్ణయం.. ధర్మశాల టు అహ్మదాబాద్!
- మే 11న ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్
- ధర్మశాలకు బదులు అహ్మదాబాద్‌లో మ్యాచ్
- ఢిల్లీ నుండి అహ్మదాబాద్‌కు విమానంలో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2025లో భాగంగా మే 11న ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ మధ్య జరగాల్సిన లీగ్ మ్యాచ్ వేదిక మారింది. ధర్మశాలకు బదులు అహ్మదాబాద్‌లో ఈ మ్యాచ్ జరగనుంది. ఈ విషయాన్ని గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి అనిల్ పటేల్ ధృవీకరించారు. ‘ఆపరేషన్ సిందూర్’ నేపథ్యంలో ధర్మశాల విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేసిన విషయం తెలిసిందే. ఉత్తర భారతదేశంలోని చాలా విమానాశ్రయాలు మే 10 వరకు మూసివేయబడ్డాయి.
పంజాబ్ కింగ్స్ ప్లేయర్స్ రోడ్డు మార్గంలో ఢిల్లీకి చేరుకుని, ఢిల్లీ నుండి అహ్మదాబాద్‌కు విమానంలో వెళ్తారని తెలుస్తోంది. మే 8 హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరిగే మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తలపడనున్నాయి. రెండు జట్లు ఇప్పటికే హిమాచల్ ప్రదేశ్ నగరానికి చేరుకున్నాయి కాబట్టి మ్యాచ్ యధావిధిగా జరగనుంది. ప్లేఆఫ్‌కు అర్హత సాధించడానికి పంజాబ్, ముంబై జట్లకు అవకాశాలు ఉన్న నేపథ్యంలో మ్యాచ్ కీలకంగా మారింది. పంజాబ్ ప్రస్తుతం 11 మ్యాచ్‌లలో ఏడు విజయాలు సాధించి +0.376 రన్ రేట్‌తో పాయింట్ల పట్టికలో మూడవ స్థానంలో ఉంది. మరోవైపు ముంబై ఏడు విజయాలు సాధించి +1.156 రన్ రేట్‌తో పట్టికలో నాల్గవ స్థానంలో ఉంది.
Also Read
తాజావార్తలు
-
Iran: పాక్, టర్కీతో ఒప్పందాలు రక్షించలేవు.. సౌదీకి ఇరాన్ వార్నింగ్..
-
Trump: యుద్ధంపై ట్రంప్ మరోసారి కీలక ప్రకటన.. ఇరాన్ రియాక్షన్ ఇదే!
-
Dancers Association : డ్యాన్సర్స్ అసోసియేషన్‌కు ఫిల్మ్ ఫెడరేషన్ బిగ్ షాక్
-
AP FDC : ఏపీలో షూటింగ్‌లకు గుడ్‌న్యూస్.. ఇక ఫాస్ట్ ట్రాక్ పర్మిషన్లు.!
-
Fake Certificates: ఇదేం మోసం బాబోయ్.. ఒకే వ్యక్తికి రెండు ప్రభుత్వ ఉద్యోగాలు..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!