Site icon NTV Telugu

PBKS vs MI: బీసీసీఐ కీలక నిర్ణయం.. ధర్మశాల టు అహ్మదాబాద్‌!

Pbks Vs Mi

Pbks Vs Mi

ఐపీఎల్ 2025లో భాగంగా మే 11న ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ మధ్య జరగాల్సిన లీగ్ మ్యాచ్‌ వేదిక మారింది. ధర్మశాలకు బదులు అహ్మదాబాద్‌లో ఈ మ్యాచ్ జరగనుంది. ఈ విషయాన్ని గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి అనిల్ పటేల్ ధృవీకరించారు. ‘ఆపరేషన్‌ సిందూర్‌’ నేపథ్యంలో ధర్మశాల విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేసిన విషయం తెలిసిందే. ఉత్తర భారతదేశంలోని చాలా విమానాశ్రయాలు మే 10 వరకు మూసివేయబడ్డాయి.

పంజాబ్ కింగ్స్ ప్లేయర్స్ రోడ్డు మార్గంలో ఢిల్లీకి చేరుకుని, ఢిల్లీ నుండి అహ్మదాబాద్‌కు విమానంలో వెళ్తారని తెలుస్తోంది. మే 8 హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరిగే మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్‌ తలపడనున్నాయి. రెండు జట్లు ఇప్పటికే హిమాచల్ ప్రదేశ్ నగరానికి చేరుకున్నాయి కాబట్టి మ్యాచ్ యధావిధిగా జరగనుంది. ప్లేఆఫ్‌కు అర్హత సాధించడానికి పంజాబ్, ముంబై జట్లకు అవకాశాలు ఉన్న నేపథ్యంలో మ్యాచ్ కీలకంగా మారింది. పంజాబ్ ప్రస్తుతం 11 మ్యాచ్‌లలో ఏడు విజయాలు సాధించి +0.376 రన్ రేట్‌తో పాయింట్ల పట్టికలో మూడవ స్థానంలో ఉంది. మరోవైపు ముంబై ఏడు విజయాలు సాధించి +1.156 రన్ రేట్‌తో పట్టికలో నాల్గవ స్థానంలో ఉంది.

Exit mobile version