NTV Telugu Site icon

IPL 2025: నికోలస్ పూరన్ అరుదైన రికార్డు.. హిట్‌మ్యాన్ రోహిత్ వల్ల కూడా కాలే!

Nicholas Pooran Gt

Nicholas Pooran Gt

వెస్టిండీస్ హార్డ్ హిట్టర్, లక్నో సూపర్ జెయింట్స్ బ్యాటర్ నికోలస్ పూరన్ అరుదైన రికార్డు ఖాతాలో వేసుకున్నాడు. టీ20 క్రికెట్‌లో 600 సిక్సర్ల మైలురాయిని అధిగమించిన నాలుగో ఆటగాడిగా నిలిచాడు. ఐపీఎల్ 2025లో భాగంగా సోమవారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 సిక్సర్లు బాదడంతో పూరన్ తన టీ20 కెరీర్‌లో 600 సిక్సర్ల మైలురాయిని అధిగమించాడు. దాంతో క్రికెట్‌లో అత్యంత భయంకరమైన హిట్టర్లలో తాను ఒకడినని నిరూపించాడు.

నికోలస్ పూరన్ కంటే ముందు టీ20 క్రికెట్‌లో 600 సిక్సర్లు బాదిన ఆటగాళ్లు వెస్టిండీస్ వారే కావడం విశేషం. యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ 463 మ్యాచ్‌ల్లో 1056 సిక్సర్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. విండీస్ మాజీ ప్లేయర్స్ కీరాన్ పొలార్డ్ (908 సిక్సర్లు), ఆండ్రీ రస్సెల్ (733 సిక్సర్లు) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. తాజాగా ఈ జాబితాలో నికోలస్ పూరన్ చేరాడు. పూరన్ 385 టీ20 మ్యాచ్‌ల్లో 606 సిక్సర్లు బాదాడు. 2023 నుండి లక్నో సూపర్ జెయింట్స్ తరఫున ఆడుతూ కీలక ఆటగాడిగా ఉన్నాడు. లక్నో తరఫున 30 మ్యాచ్‌ల్లో 65 సిక్సర్లు బాదాడు. ఈ ఘనత హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ వాళ్ళ కూడా కాలేదు. ఇక ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పూరన్ వీరవిహారం చేశాడు. 30 బంతుల్లోనే 75 పరుగులు బాదాడు. ఇందులో 6 ఫోర్లు, 7 సిక్స్‌లు ఉన్నాయి.

Also Read: GT vs PBKS: గుజరాత్‌, పంజాబ్‌ ప్లేయింగ్ 11.. స్టార్ ఆటగాడికి చోటు కష్టమే!

టీ20ల్లో అత్యధిక సిక్సర్లు బాదిన ప్లేయర్స్ లిస్ట్:
# క్రిస్ గేల్: 1056 సిక్సర్లు
# కీరాన్ పొలార్డ్: 908 సిక్సర్లు
# ఆండ్రీ రస్సెల్: 733 సిక్సర్లు
# నికోలస్ పూరన్: 606 సిక్సర్లు
# అలెక్స్ హేల్స్ : 552 సిక్సర్లు