Site icon NTV Telugu

Virat Kohli: విరాట్ కోహ్లీ అరుదైన రికార్డు.. తొలి భారత బ్యాటర్‌గా..!

Virat Kohli Rcb

Virat Kohli Rcb

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తన కెరీర్‌లో మరో మైలురాయిని చేరుకున్నాడు. టీ20 క్రికెట్‌లో 13,000 పరుగులను పూర్తి చేశాడు. దాంతో ఈ ఘనతను అందుకున్న తొలి భారత బ్యాటర్‌గా విరాట్ రికార్డుల్లోకెక్కాడు. ఐపీఎల్ 2025లో భాగంగా సోమవారం ముంబైలోని వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓపెనర్ కోహ్లీ అర్ధ శతకం(67; 42 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లు)తో మెరవడంతో ఈ రికార్డు సొంతమైంది. 17 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద టీ20 క్రికెట్‌లో విరాట్ 13,000 పరుగులు పూర్తి చేశాడు.

టీ20 క్రికెట్ చరిత్రలో 13,000 పరుగుల ఘనత సాధించిన ఐదవ బ్యాటర్‌గా విరాట్ కోహ్లీ నిలిచాడు. కోహ్లీ తన 386వ టీ20 ఇన్నింగ్స్‌లో ఈ మైలురాయిని అందుకున్నాడు. అదే సమయంలో అత్యంత వేగంగా ఈ మైలురాయిని చేరుకున్న రెండవ బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ 381 ఇన్నింగ్స్‌లలోనే 13,000 పరుగులను చేరుకున్నాడు. ఇక కోహ్లీ కంటే ముందు నలుగురు క్రికెటర్లు టీ20ల్లో 13 వేల రన్స్ పూర్తి చేశారు. క్రిస్ గేల్, అలెక్స్ హేల్స్, షోయబ్ మాలిక్, కీరన్ పొలార్డ్ ముందున్నారు.

Also Read: MI vs RCB: ఉత్కంఠ పోరులో బెంగళూరు విజయం.. ముంబై ప్లేఆఫ్స్‌ అవకాశాలు సంక్లిష్టం!

టీ20ల్లో 13,000 పరుగులు చేసిన బ్యాటర్లు:
# క్రిస్ గేల్ – 14562 (381 ఇన్నింగ్స్‌లు)
# అలెక్స్ హేల్స్ -13610 (474 ఇన్నింగ్స్‌లు)
# షోయబ్ మాలిక్ – 13557 (487 ఇన్నింగ్స్‌లు)
# కీరన్ పొలార్డ్ – 13537 (594 ఇన్నింగ్స్‌లు)
# విరాట్ కోహ్లీ – 13050 (386 ఇన్నింగ్స్‌లు)

 

Exit mobile version