NTV Telugu Site icon

IPL 2025 Mega Auction: ఎస్ఆర్‌హెచ్‌ లోకి టీమిండియా స్టార్ బౌలర్

Shami

Shami

IPL 2025 Mega Action Mohammed Shami SRH: జెడ్డా వేదికగా జరుగుతున్న ఐపీఎల్ 2025 మెగా వేలంలో ఆటగాళ్లను నువ్వా నేనా అన్నట్లుగా కొనేస్తున్నాయి ఐపీఎల్ ఫ్రాంచైజీలు. ఇకపోతే, టీమిండియా స్టార్ బౌలర్ మహ్మద్ షమీని సన్ రైజర్స్ హైదరాబాద్ కొనుగోలు చేసింది. రూ.10 కోట్లకు ఎస్ఆర్‌హెచ్‌ మహ్మద్ షమీని దక్కించుకుంది. ఈ వేలంలో ఇప్పటి వరకు ఏ ఆటగాడు ఏ టీం కొనుగోలు చేసిందో ఒకసారి చూద్దాం.

* రైట్ టు మ్యాచ్ కింద అర్ష్‌దీప్ సింగ్‌ను రూ. 18 కోట్లకు సొంతం చేసుకుంది పంజాబ్ కింగ్స్.

* దక్షిణాఫ్రికా ఆటగాడు కగిసో రబాడను రూ. 10.75 కోట్లకు సొంతం చేసుకుంది గుజరాత్ టైటాన్స్.

* శ్రేయాస్ అయ్యర్ రూ.26.75 కోట్లకు పంజాబ్ కింగ్స్ సొంతం చేసుకుంది.

* ఇంగ్లాండ్ స్టార్ అల్ రౌండర్ జోస్ బట్లర్ ను రూ.15.75 కోట్లకు గుజరాత్ టైటాన్స్ సొంతం చేసుకుంది.

* ఆస్ట్రేలియా బౌలర్ మిచెల్ స్టార్క్‌ను రూ.11.75 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్ సొంతం చేసుకుంది.

* రూ.27 కోట్లకు రిషబ్ పంత్‌ను లక్నో సూపర్ జెయింట్స్ సొంతం చేసుకుంది. దీంతో ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ఆటగాడిగా రికార్డ్ సృష్టించాడు.

* సౌతాఫ్రికా డేంజరస్ బ్యాటర్ డేవిడ్ మిల్లర్‌ను రూ.7.5 కోట్లకు లక్నో సొంతం చేసుకుంది.

* టీమిండియా స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్‌ను పంజాబ్ కింగ్స్ రూ. 18 కోట్లకు సొంతం చేసుకుంది.

* హైదరబాద్ ఆటగాడు మహమ్మద్ సిరాజ్ గుజరాత్ టైటాన్స్ రూ. 12.25 కోట్లకు సొంతం చేసుకుంది.

* ఆల్ రౌండర్ లియామ్ లివింగ్ స్టోన్‌ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రూ.8.75 కోట్లకు సొంతం చేసుకుంది.

* ఎన్నో ఆశలు పెట్టుకున్న స్టార్ బ్యాట్స్‌మెన్ కేఎల్ రాహుల్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ రూ. 14 కోట్లకు సొంతం చేసుకుంది.