Site icon NTV Telugu

LSG vs RR: ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌పై లక్నో విజయం

Lsg

Lsg

LSG vs RR: ఐపీఎల్ 18వ సీజన్‌లో భాగంగా జరిగిన ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ రాజస్థాన్ రాయల్స్‌పై 2 పరుగుల తేడాతో సెన్సేషనల్ విజయం సాధించింది. 181 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్‌ రాయల్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 178 పరుగులకే పరిమితమైంది. రాజస్థాన్ బ్యాట్స్‌మెన్లలో యశస్వి జైస్వాల్ 74 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. రియాన్ పరాగ్ 39, వైభవ్ సూర్యవంశీ 34 పరుగులు చేశారు. చివరి ఓవర్‌లో విజయానికి 9 పరుగులు అవసరమైన తరుణంలో లక్నో బౌలర్ అవేశ్ ఖాన్ అద్భుతంగా బౌలింగ్‌ చేశాడు. కేవలం 6 పరుగులే ఇచ్చి శిమ్రోన్ హెట్‌మయర్‌ను (12) ఔట్ చేశాడు. లక్నో సూపర్ జెయింట్స్ బ్యాటింగ్‌లో ఐదెన్ మార్‌క్రమ్ 66 పరుగులు, ఆయుష్ బదోని 50 పరుగులతో అర్ధశతకాలు సాధించగా, చివరి ఓవర్‌లో అబ్దుల్ సమద్ 10 బంతుల్లో 30 పరుగులు (4 సిక్సులు) బాదడంతో జట్టు స్కోరు 180 పరుగులకు చేరుకుంది. మిడిల్ ఆర్డర్‌లో మిచెల్ మార్ష్ (4), నికోలస్ పూరన్ (11), రిషభ్ పంత్ (3) విఫలమయ్యారు. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో వానిందు హసరంగ 2 వికెట్లు, జోఫ్రా ఆర్చర్, సందీప్ శర్మ, తుషార్ దేశ్‌పాండే తలో వికెట్ తీసారు.

Pakistan: బంగ్లాదేశ్ దారిలో పాకిస్తాన్.. కేఎఫ్‌సీ రెస్టారెంట్లపై దాడులు..

Exit mobile version