Site icon NTV Telugu

KKR vs RR: ఉత్కంఠ పోరులో 1 పరుగు తేడాతో కేకేఆర్ విజయం.. రియాన్‌ పరాగ్‌ మెరుపులు వృధా!

Kkr

Kkr

ఐపీఎల్ 2025లో భాగంగా రాజస్థాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ అద్భుత విజయం సాధించింది. చివరి బంతి వరకు నువ్వా నేనా అన్నట్లు ఉత్కంఠగా జరిగగా.. చివరికి 1 పరుగు తేడాతో కేకేఆర్ గెలుపొందింది. చివరి బంతికి మూడు రన్స్ అవసరం కాగా.. శుభమ్ దుబే ఒకే రన్ తీశాడు. ఛేదనలో ఆర్ఆర్ 8 వికెట్లు కోల్పోయి 205 పరుగులు చేసింది. ఈ విజయంతో కోల్‌కతా ప్లేఆఫ్స్‌ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. మరోవైపు రాజస్థాన్ ఇప్పటికే ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన కోల్‌కతా 4 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది.. ఆండ్రీ రస్సెల్ (57 నాటౌట్ ; 25 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్స్‌లు) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు. రెహ్మనుల్లా గుర్బాజ్ (35; 25 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌లు), అజింక్య రహానే (30; 24 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్స్‌లు), అంగ్‌క్రిష్‌ రఘువంశీ (44; 31 5 ఫోర్లు),రాణించారు. ఇనింగ్స్ చివర్లో రింకు సింగ్ (19 నాటౌట్; 6 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్స్‌లు) మెరుపులు మెరిపించాడు. రాజస్థాన్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్, యుధ్విర్ సింగ్, మహీశ్‌ తీక్షణ, రియాన్ పరాగ్ ఒక్కో వికెట్ తీశారు.

Also Read: PBKS vs LSG: బౌలింగ్‌ ఎంచుకున్న లక్నో.. ఆకాష్ ఐపీఎల్ అరంగేట్రం!

లక్ష్య ఛేదనలో రాజస్థాన్‌కు ఆదిలోనే షాక్ తగిలింది. కుర్రాడు వైభవ్ సూర్యవంశీ (4) మరోసారి విఫలమయ్యాడు. వెంటనే కునాల్ సింగ్ రాథోడ్ డకౌట్ అయ్యాడు. ఈ సమయంలో యశస్వి జైస్వాల్ (34; 21 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌), రియాన్ పరాగ్ (95; 45 బంతుల్లో 6 ఫోర్లు, 8 సిక్స్‌లు) జట్టును ఆదుకున్నారు. యశస్వి అవుట్ అనంతరం ధ్రువ్‌ జురెల్ (0), వానిందు హసరంగ (0) ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. దాంతో ఆర్ఆర్ కష్టాల్లో పడింది. ఈ దశలో హెట్‌మయర్ (29; 23 బంతుల్లో)తో కలిసి పరాగ్ రెచ్చిపోయాడు. వరుసగా సిక్సులు బాది రాజస్థాన్‌ను రేసులోకి తెచ్చాడు. అయితే సెంచరీ స్వల్ప వ్యవధిలో హెట్‌మయర్, పరాగ్ పెవిలియన్ చేరారు. శుభమ్ దుబే (25), జోఫ్రా ఆర్చర్ (12) పోరాడినా ఫలితం లేకుండా పోయింది.

Exit mobile version