NTV Telugu Site icon

GT vs PBKS: గుజరాత్‌, పంజాబ్‌ ప్లేయింగ్ 11.. స్టార్ ఆటగాడికి చోటు కష్టమే!

Gt Vs Pbks Dream 11 Prediction

Gt Vs Pbks Dream 11 Prediction

ఐపీఎల్‌ 2025లో భాగంగా ఈరోజు గుజరాత్‌ టైటాన్స్‌, పంజాబ్‌ కింగ్స్‌ జట్లు తలపడనున్నాయి. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో రాత్రి 7.30కు మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ సీజన్లో గుజరాత్‌, పంజాబ్‌ జట్లకు ఇదే మొదటి మ్యాచ్. ఈ నేపథ్యంలో విజయంతో టోర్నీని ఆరంభించాలని ఇరు జట్లు చూస్తున్నాయి. రెండు టీమ్స్ బలంగా ఉండడంతో రసవత్తర పోరు ఖాయంగా కనిపిస్తోంది. గుజరాత్‌కు శుభ్‌మాన్ గిల్, పంజాబ్‌కు శ్రేయాస్ అయ్యర్ నాయకత్వం వహిస్తున్నారు. గత సీజన్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌ను విజేతగా నిలిపిన అయ్యర్‌పై భారీ అంచనాలు ఉన్నాయి.

శుభ్‌మాన్ గిల్ వరుసగా రెండో సీజన్‌లో గుజరాత్‌ టైటాన్స్ జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు. గుజరాత్ ఈసారి పూర్తిగా మారిపోయింది. ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జోస్ బట్లర్ జట్టులోకి వచ్చాడు. అతడు గిల్‌తో కలిసి ఓపెనింగ్ చేయనున్నాడు. మూడో స్థానంలో సాయి సుదర్శన్, గ్లెన్ ఫిలిప్స్ నాలుగో స్థానంలో ఆడనున్నారు. షారుఖ్ ఖాన్, రాహుల్ తెవాటియాలు 5, 6 స్థానంలో వస్తారు. వాషింగ్టన్ సుందర్, రషీద్ ఖాన్ స్పిన్ విభాగంలో ఆడతారు. ఫాస్ట్ బౌలింగ్ కోటాలో కగిసో రబాడ, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణలు ఆడనున్నారు.

కోల్‌కతా ఓపెనర్లుగా ప్రభ్‌సిమ్రాన్ సింగ్, జోష్ ఇంగ్లిస్ ఆడనున్నారు. ప్రియాంష్ ఆర్య, శ్రేయాస్ అయ్యర్, మార్కస్ స్టోయినిస్, గ్లెన్ మాక్స్‌వెల్, శశాంక్ సింగ్ తరువాతి స్థానాల్లో బ్యాటింగ్ చేయనున్నారు. అర్ష్ దీప్ సింగ్, మార్కో జాన్సెన్ పేస్ కోటాలో యుజ్వేంద్ర చహల్, హర్‌ప్రీత్ బ్రార్ స్పిన్ కోటాలో ఆడనున్నారు. పేసర్ లాకీ ఫెర్గూసన్ జట్టులో ఉండాలంటే జోష్ ఇంగ్లిస్ స్థానంలో నేహాల్ వాధేరా ఆడే అవకాశం ఉంది.

తుది జట్లు:
గుజరాత్‌: జోస్ బట్లర్, శుభ్‌మాన్ గిల్, సాయి సుదర్శన్, గ్లెన్ ఫిలిప్స్, షారుఖ్ ఖాన్, రాహుల్ తెవాటియా, వాషింగ్టన్ సుందర్, రషీద్ ఖాన్, కగిసో రబాడ, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ.
కోల్‌కతా: ప్రభ్‌సిమ్రాన్ సింగ్, జోష్ ఇంగ్లిస్, ప్రియాంష్ ఆర్య, శ్రేయాస్ అయ్యర్, మార్కస్ స్టోయినిస్, గ్లెన్ మాక్స్‌వెల్, శశాంక్ సింగ్, అర్ష్ దీప్ సింగ్, మార్కో జాన్సెన్, యుజ్వేంద్ర చహల్, హర్‌ప్రీత్ బ్రార్.