NTV Telugu Site icon

GT vs PBKS: టాస్ గెలిచిన గుజరాత్.. తుది జట్లు ఇవే!

Gt Vs Pbks Playing 11

Gt Vs Pbks Playing 11

ఐపీఎల్ 2025లో భాగంగా మరికాసేపట్లో గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి. గుజరాత్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. రెండు టీమ్స్ బలంగా ఉండడంతో మ్యాచ్ రసవత్తరంగా సాగనుంది. ఈ సీజన్లో గుజరాత్‌, పంజాబ్‌ జట్లకు ఇదే మొదటి మ్యాచ్. ఈ నేపథ్యంలో విజయంతో టోర్నీని ఆరంభించాలని ఇరు జట్లు చూస్తున్నాయి. గుజరాత్‌కు శుభ్‌మాన్ గిల్, పంజాబ్‌కు శ్రేయాస్ అయ్యర్ నాయకత్వం వహిస్తున్నారు.

తుది జట్లు ఇవే:
పంజాబ్: ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (కీపర్), ప్రియాంశ్‌ ఆర్య, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), శశాంక్ సింగ్, మార్కస్ స్టాయినిస్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, సూర్యాంశ్ షెడ్గే, అజ్మతుల్లా ఒమర్జాయ్, మార్కో యాన్సెన్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చహల్.
గుజరాత్: శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), జోస్ బట్లర్ (కీపర్‌), సాయి సుదర్శన్, షారుక్ ఖాన్, రాహుల్ తెవాతియా, సాయి కిషోర్, అర్షద్ ఖాన్, రషీద్ ఖాన్, కగిసో రబాడ, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ.