NTV Telugu Site icon

IPL Auction 2025: జెడ్డాలో ఐపీఎల్‌ మెగా వేలం.. పేర్లు నమోదు చేసుకున్న 1574 మంది క్రికెటర్లు!

Ipl 2025 Dates

Ipl 2025 Dates

ఐపీఎల్‌ 2025 మెగా వేలం తేదీలు ఖరారు అయ్యాయి. నవంబర్ 24, 25వ తేదీల్లో సౌదీ అరేబియాలోని జెడ్డాలో వేలం జరగనుంది. ఈ విషయాన్ని బీసీసీఐ మంగళవారం ప్రకటించింది. సోమవారంతో (నవంబర్ 4) ప్లేయర్ రిజిస్ట్రేషన్ అధికారికంగా ముగిసింది. మొత్తం 1,574 మంది క్రికెటర్లు మెగా వేలం కోసం పేర్లు నమోదు చేసుకున్నారు. ఇందులో 1,165 మంది భారతీయులు ఉండగా.. 409 మంది విదేశీ ప్లేయర్స్ ఉన్నారు.

ఐపీఎల్ 2025 వేలం జాబితాలో 320 క్యాప్‌డ్ ప్లేయర్‌లు, 1,224 అన్‌క్యాప్‌డ్ ప్లేయర్‌లు, 30 అసోసియేట్ నేషన్స్ ప్లేయర్‌లు ఉన్నారు. 48 మంది క్యాప్‌డ్ ఇండియన్స్, 272 క్యాప్‌డ్ ఇంటర్నేషనల్స్ ప్లేయర్స్, 965 మంది అన్‌క్యాప్‌డ్ ఇండియన్ ప్లేయర్‌లు, 104 అన్‌క్యాప్‌డ్ ఇంటర్నేషనల్స్ ప్లేయర్స్ ఉన్నారు. రిషబ్‌ పంత్, కేఎల్‌ రాహుల్, శ్రేయస్‌ అయ్యర్, అర్ష్‌దీప్‌ సింగ్‌ వంటి అగ్రశ్రేణి ఆటగాళ్లు వేలంలో ఉన్నారు. వీరికి కాసుల వర్షం కురిసే అవకాశం ఉంది;.

వేలంలో మొత్తం 204 మంది క్రికెటర్లను ఫ్రాంఛైజీలు కొనుక్కోవాల్సి ఉంది. ఒక్కో ఫ్రాంఛైజీ గరిష్టంగా 25 మంది ఆటగాళ్లను జట్టులోకి తీసుకోవచ్చు. ఇందులో అట్టిపెట్టుకున్న క్రికెటర్స్ కూడా ఉన్నారు. 10 ఫ్రాంఛైజీలు 46 మంది ఆటగాళ్లను అట్టిపెట్టుకున్నాయి. జట్లను తయారుచేసుకోవడానికి ప్రతి ఫ్రాంఛైజీకి రూ.120 కోట్లు కేటాయించారు. ఖర్చు చేయడానికి అన్ని ఫ్రాంఛైల వద్ద రూ.641.5 కోట్ల డబ్బుంది. రిటెన్షన్‌ అనంతరం పంజాబ్‌ కింగ్స్‌ వద్ద అత్యధికంగా రూ.110.5 కోట్లు ఉండగా.. అతి తక్కువగా రాజస్థాన్‌ రాయల్స్‌ వద్ద రూ.41 కోట్లు ఉన్నాయి.

Show comments