Delhi Capitals Retention List for IPL 2025: ఐపీఎల్ 2025 మెగా వేలానికి సంబంధించి రిటెన్షన్ రూల్స్‌ను ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ప్రకటించిన విషయం తెలిసిందే. మొత్తంగా ఆరుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకునేందుకు ప్రాంచైజీలకు అవకాశం ఇచ్చింది. ఇందులో రైట్ టు మ్యాచ్ (ఆర్‌టీఎం) ఆప్షన్ కూడా ఉంది. అక్టోబర్ 31లోపు రిటెన్షన్ జాబితాను అన్ని ఫ్రాంచైజీలు సమర్పించాల్సి ఉంటుంది. ఇక నవంబర్‌లో మెగా వేలం జరిగే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ) తమ రిటెన్షన్ లిస్ట్‌ను ఖరారు చేసినట్లు తెలుస్తోంది.
నలుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకుని.. ఇద్దరు విదేశీ ప్లేయర్లను ఆర్‌టీఎమ్ కార్డ్ ద్వారా తిరిగి దక్కించుకోవాలని ఢిల్లీ క్యాపిటల్స్ చూస్తోందని సమాచారం. టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ రిటెన్షన్ లిస్ట్‌లో ప్రథమ ఎంపికగా ఉన్నాడు. పంత్ ఢిల్లీ కెప్టెన్ అన్న విషయం తెలిసిందే. స్టార్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ రెండో ఎంపికగా, స్పిన్నర్ కుల్‌దీప్ యాదవ్ మూడో ఎంపికగా ఉన్నారు. ఇక అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా భారత యువ వికెట్ కీపర్ అభిషేక్ పోరెల్‌ను రిటైన్ చేసుకోవాలని ఢిల్లీ భావిస్తోందట. వికెట్ కీపింగ్ సహా హిట్టింగ్ చేయడం అతడికి కలిసొచ్చే అంశం. విదేశీ ప్లేయర్లు జేక్ ఫ్రేజర్ మెక్‌గర్క్, ట్రిస్టన్ స్టబ్స్‌ను ఆర్‌టీఎమ్‌తో దక్కించుకోవాలని డీసీ చూస్తోందని తెలుస్తోంది.
ఐపీఎల్ 2025 నిబంధనల ప్రకారం.. రిటైన్ చేసుకునే మొదటి ఆటగాడికి ఫ్రాంఛైజీ రూ.18 కోట్లు ఇవ్వాలి. రెండో ఆటగాడికి రూ.14 కోట్లు, మూడో ఆటగాడికి రూ.11 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. నాలుగు, అయిదవ ఆటగాడికి వరుసగా రూ.18 కోట్లు, రూ.14 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. అన్‌క్యాప్డ్ ఆటగాడికి 4 కోట్లు ఇవ్వాలి. అభిషేక్ పోరెల్‌కు 4 కోట్లు దక్కనున్నాయి. అంటే అతడికి జాక్‌పాట్ తగలనుంది. గత సీజన్‌లో అభిషేక్ 327 పరుగులు చేశాడు.
Also Read: Traffic Challan: హెల్మెట్ పెట్టుకోనందుకు లక్ష చలానా.. ఎక్కడో తెలుసా?
ఢిల్లీ క్యాపిటల్స్ రిటెన్షన్ లిస్ట్ (అంచనా):
రిషబ్ పంత్
అక్షర్ పటేల్
కుల్దీప్ యాదవ్
అభిషేక్ పోరెల్ (అన్‌క్యాప్డ్)
జేక్‌ఫ్రేజర్ మెక్‌గర్క్ (ఆర్‌టీఎమ్)
ట్రిస్టన్ స్టబ్స్ (ఆర్‌టీఎమ్)