AB De Villiers About Rohit Sharma Joins in RCB: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 మెగా వేలానికి సంబంధించి రిటెన్షన్ రూల్స్‌ను ఇటీవల బీసీసీఐ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈసారి ఆరుగురి ఆటగాళ్లను రిటైన్ చేసుకునేందుకు ప్రాంచైజీలకు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ అవకాశం ఇచ్చింది. ఇందులో ఒక రైట్ టు మ్యాచ్ (ఆర్‌టీఎం) ఆప్షన్ ఉంది. గతంలో ప్రతీ ఫ్రాంచైజీ పర్స్ వాల్యూ రూ.90 కోట్లు కాగా.. సారి రూ.120 కోట్లకు పెంచారు. అట్టిపెట్టుకున్న అయిదుగురి కోసం ఓ ఫ్రాంఛైజీ రూ.75 కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. అక్టోబర్ 31లోపు రిటెన్షన్ జాబితాను సమర్పించేందుకు తుది గడువు. నవంబర్‌లో వేలం జరిగే అవకాశం ఉంది.
మెగా వేలం సమీపిస్తున్న నేపథ్యంలో ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ భవిష్యత్తు మిస్టరీగా మారింది. ఐపీఎల్ 2024లో హార్దిక్ పాండ్యాను కెప్టెన్‌గా నియమించడంతో.. రోహిత్ సహా అభిమానులకు మింగుడుపడలేదు. హార్దిక్, రోహిత్ మధ్య విభేదాలు ఉన్నాయని వార్తలు మొదలయ్యాయి. రోహిత్ వేలంలోకి అడుగుపెట్టే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. వేలంలో రోహిత్‌ను కొనుగోలు చేయాలని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును ఇటీవల మాజీ భారత బ్యాటర్ మహ్మద్ కైఫ్ కోరారు. అయితే ఆర్‌సీబీ మాజీ బ్యాటర్ ఏబీ డివిలియర్స్ మాత్రం రోహిత్ బెంగళూరుకు వచ్చే అవకాశమే లేదని అన్నాడు.
Also Read: T20 World Cup 2024: చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో మ్యాచ్.. భారత్‌కు చావోరేవో! రికార్డ్స్ ఇవే
ఓ యూట్యూబ్ ఛానెల్‌లో ఏబీ డివిలియర్స్ మాట్లాడుతూ… ‘రోహిత్ శర్మపై వస్తున్నవార్తలు చూసి నేను నవ్వుకున్నాను. ముంబై ఇండియన్స్ నుండి ఆర్‌సీబీకే రోహిత్ మారితే పెద్ద స్టోరీనే అవుతుంది. వావ్.. ఓసారి ఆ హెడ్ లైన్స్‌ను ఊహించుకోండి. ఇది హార్దిక్ పాండ్యా కంటే పెద్ద న్యూస్ అవుతుంది. హార్దిక్ గుజరాత్ టైటాన్స్ నుండి తిరిగి ముంబైకి వచ్చాడు. అది పెద్ద సర్‌ప్రైజ్ఏమీ కాదు. రోహిత్ ఆర్‌సీబీలో చేరడం పెద్ద ఆశ్చర్యం. అతడు ఆర్‌సీబీలో చేరే అవకాశమే లేదు. ఇంతకు ముంబై రోహిత్ను విడిచిపెడుతుందా?. అందుకు 0 లేదా 0.1 శాతం కూడా లేదు’ అని అన్నాడు.