KKR vs RR: రస్సెల్ ఊచకోత.. రాజస్థాన్ రాయల్స్ ముందు భారీ లక్ష్యం!
- ఆండ్రీ రస్సెల్ ఊచకోత
- భారీ స్కోర్ చేసిన కోల్‌కతా నైట్ రైడర్స్
- 6 బంతుల్లోనే 19 పరుగులు చేసిన రింకు సింగ్
- రాజస్థాన్ రాయల్స్ ముందు భారీ లక్ష్యం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2025లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ భారీ స్కోర్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 206 రన్స్ చేసింది. ఇన్నింగ్స్ చివరలో ఆండ్రీ రస్సెల్ (57 నాటౌట్; 25 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్స్‌లు) ఊచకోత కోశాడు. ముందుగా 8 బంతుల్లో 2 పరుగులే చేసిన రస్సెల్.. ఆపై 17 బంతుల్లో 55 రన్స్ బాదాడు. విండీస్ హిట్టర్ ఫోర్లు, సిక్సులతో విరుచుకుపడడంతో కోల్‌కతా స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. రింకు సింగ్ 6 బంతుల్లోనే 19 పరుగులు చేశాడు. రాజస్థాన్ రాయల్స్ ముందు 207 పరుగుల లక్ష్యాన్ని కోల్‌కతా నిర్దేశించింది.
Also Read: MS Dhoni: చరిత్ర సృష్టించిన ఎంఎస్ ధోనీ.. కోహ్లీకి కూడా సాధ్యం కాలే!
Also Read
- Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్... సబ్బులు, బాడీ వాష్‌లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
- Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
- Pakistan: గర్భిణీలు, చిన్న పిల్లల్ని కూడా వదల్లేదు.. POKలో పాక్ ఆర్మీ దుర్మార్గాలు..
- Off The Record: అధికారం కోసం తప్ప పార్టీ కోసం ఎవరూ పని చేయట్లేదా..? ఆ ఉమ్మడి జిల్లా జనసేన కమిటీ మొత్తం రద్దు..
టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతాకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ సునీల్ నరైన్ (11)ను రెండో ఓవర్‌లో యుధ్విర్ సింగ్ అవుట్ చేశాడు. ఈ సమయంలో తర్వాత రెహ్మనుల్లా గుర్బాజ్ (35; 25 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌లు), అజింక్య రహానే (30; 24 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్స్‌లు) నిలకడగా ఆడారు. గుర్భాజ్ అవుట్ అనంతరం రహానే, అంగ్‌క్రిష్ రఘువంశీ (44; 31 బంతుల్లో 5 ఫోర్లు) ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించారు. రహానే పెవిలియన్ చేరిన అనంతరం కోల్‌కతా తక్కువ స్కోరుకే పరిమితమయ్యేలా కనిపించింది. ఆరంభంలో నెమ్మదిగా ఆడిన రస్సెల్.. ఆపై విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలో ఐపీఎల్ 2025లో తొలి హాఫ్ సెంచరీ బాదాడు. చివరి ఓవర్‌లో రింకు సింగ్ 4, 6, 6 బాదేసి స్కోరును 200 దాటించేశాడు. రాజస్థాన్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్, యుధ్విర్ సింగ్, మహీశ్ తీక్షణ, రియాన్ పరాగ్ ఒక్కో వికెట్ తీశారు.
తాజావార్తలు
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్… సబ్బులు, బాడీ వాష్‌లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
-
OTR : బండి ఎందుకు దూరమవుతున్నారు.?
-
Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
-
SIPRI 2026: తొలిసారి అణ్వాయుధాలు మోహరించిన భారత్.. వణుకుతున్న శత్రు దేశాలు! సిప్రి షాకింగ్ నివేదిక..
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్‌కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!