Site icon NTV Telugu

KKR vs RR: రస్సెల్‌ ఊచకోత.. రాజస్థాన్‌ రాయల్స్‌ ముందు భారీ లక్ష్యం!

Andre Russell

Andre Russell

ఐపీఎల్ 2025లో భాగంగా ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా రాజస్థాన్‌ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ భారీ స్కోర్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 206 రన్స్ చేసింది. ఇన్నింగ్స్ చివరలో ఆండ్రీ రస్సెల్‌ (57 నాటౌట్‌; 25 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్స్‌లు) ఊచకోత కోశాడు. ముందుగా 8 బంతుల్లో 2 పరుగులే చేసిన రస్సెల్‌.. ఆపై 17 బంతుల్లో 55 రన్స్ బాదాడు. విండీస్ హిట్టర్ ఫోర్లు, సిక్సులతో విరుచుకుపడడంతో కోల్‌కతా స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. రింకు సింగ్‌ 6 బంతుల్లోనే 19 పరుగులు చేశాడు. రాజస్థాన్‌ రాయల్స్‌ ముందు 207 పరుగుల లక్ష్యాన్ని కోల్‌కతా నిర్దేశించింది.

Also Read: MS Dhoni: చరిత్ర సృష్టించిన ఎంఎస్ ధోనీ.. కోహ్లీకి కూడా సాధ్యం కాలే!

టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతాకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ సునీల్ నరైన్ (11)ను రెండో ఓవర్‌లో యుధ్విర్‌ సింగ్ అవుట్ చేశాడు. ఈ సమయంలో తర్వాత రెహ్మనుల్లా గుర్బాజ్ (35; 25 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌లు), అజింక్య రహానే (30; 24 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్స్‌లు) నిలకడగా ఆడారు. గుర్భాజ్‌ అవుట్ అనంతరం రహానే, అంగ్‌క్రిష్‌ రఘువంశీ (44; 31 బంతుల్లో 5 ఫోర్లు) ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించారు. రహానే పెవిలియన్ చేరిన అనంతరం కోల్‌కతా తక్కువ స్కోరుకే పరిమితమయ్యేలా కనిపించింది. ఆరంభంలో నెమ్మదిగా ఆడిన రస్సెల్.. ఆపై విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలో ఐపీఎల్ 2025లో తొలి హాఫ్‌ సెంచరీ బాదాడు. చివరి ఓవర్‌లో రింకు సింగ్ 4, 6, 6 బాదేసి స్కోరును 200 దాటించేశాడు. రాజస్థాన్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్, యుధ్విర్ సింగ్, మహీశ్‌ తీక్షణ, రియాన్ పరాగ్ ఒక్కో వికెట్ తీశారు.

Exit mobile version