IPL 2025-RCB: అతడిని జట్టులోకి తీసుకోవడం దండగ: మాజీ క్రికెటర్
- డిసెంబర్‌లో ఐపీఎల్ 2025 మెగా వేలం
- అందరి చూపు డుప్లెసిస్‌పైనే
- మ్యాక్స్‌వెల్ దండగ అంటున్న ఆకాశ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Aakash Chopra About RCB Retention for IPL 2025: ఈ ఏడాది డిసెంబర్‌లో ఐపీఎల్ 2025కి సంబంధించి మెగా వేలం జరగనుంది. రిటెన్షన్‌కు సంబంధించి ఇటీవల బీసీసీఐ, ప్రాంచైజీల మధ్య భేటీ జరగగా.. భారత క్రికెట్ బోర్డు ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. త్వరలోనే రిటెన్షన్‌కు సంబంధించి బీసీసీఐ తుది నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. రిటెన్షన్, రైట్ టు మ్యాచ్ ద్వారా ఎంతమంది క్రికెటర్లకు అవకాశం ఇస్తారనే ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఇప్పటికే ఐపీఎల్ ఫ్రాంచైజీలు ఎవరిని అట్టిపెట్టుకోవాలి?, ఎవరిని వేలంలోని వదిలేయాలనే దానిపై దృష్టిసారించాయి. ఈ క్రమంలో తాజాగా భారత మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా ఆర్‌సీబీ రిటెన్షన్ విధానంపై స్పందించాడు.
కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్‌ను ఆర్‌సీబీ పక్కన పెట్టడం ఖాయం అని ఆకాశ్ చోప్రా తన యూట్యూబ్ ఛానల్‌లో చెప్పాడు. గ్లెన్ మ్యాక్స్‌వెల్‌ను జట్టులోకి తీసుకోవడం దండగ అని అభిప్రాయపడ్డాడు. ‘కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్‌ను ఆర్‌సీబీ రిటైన్ చేసుకుంటుందా? అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. రిటైన్ చేసుకోదని నేను అనుకుంటున్నా. విరాట్ కోహ్లీ తప్పకుండా జట్టులో ఉంటాడు. మహ్మద్ సిరాజ్‌ను రిటైన్ చేసుకుంటుంది. భారత బౌలర్‌గా అతడికి పక్కాగా అవకాశం ఉంటుంది’ అని ఆకాశ్ చెప్పాడు.
Also Read
- IIT Kharagpur: ఐఐటీ ఖరగ్‌పూర్‌లో విషాదం.. హైదరాబాద్‌కి చెందిన ప్రొఫెసర్ అనుమానాస్పద మృతి
- Uday Krishna Reddy: ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో మరో ట్విస్ట్..
- Ramayana Trailer: లీకులకు భయపడి విడుదల చేశారా?.. 'రామాయణం' ట్రైలర్ స్ట్రాటజీపై నెట్టింట తీవ్ర చర్చ!
- Telangana Heavy Rains: తెలంగాణలో భారీ వర్షాలు.. ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు.. అత్యవసరమైతేనే బయటకు రండి..!
Also Read: Natasa Stankovic: ముంబైలో హార్దిక్ మాజీ భార్య నటాషా స్టాంకోవిక్.. బాయ్‌ఫ్రెండ్‌తో చక్కర్లు! (వీడియో)
‘ఐపీఎల్ 2025 మెగా వేలంలో స్టార్ బౌలర్లు ఉండకపోవచ్చు. నాకే అవకాశం ఉంటే కామెరూన్ గ్రీన్‌తో పాటు రజత్ పటీదార్‌ను తీసుకుంటా. గత ఏడాది దారుణంగా విఫలమైన గ్లెన్ మ్యాక్స్‌వెల్‌ను జట్టులోకి తీసుకోవడం దండగ. అతడిని తీసుకోవద్దని ఆర్‌సీబీకి సలహా ఇస్తున్నా. మ్యాక్స్‌వెల్ కంటే విల్ జాక్స్ చాలా బెటర్. రిటైన్ నిబంధనలు వచ్చాక ఈ సంఖ్య పెరగొచ్చు లేదా తగ్గొచ్చు’ అని ఆకాశ్ చోప్రా చెప్పుకొచ్చాడు. విరాట్ కోహ్లీ, హ్మద్ సిరాజ్, కామెరూన్ గ్రీన్, రజత్ పటీదార్ సహా విల్ జాక్స్‌ను రిటైన్ చేసుకోవాలని ఆకాశ్ సూచిస్తున్నాడు.
తాజావార్తలు
-
HMD Asha 305: HMD Asha 305 విడుదల.. 2GB RAM, 16GB స్టోరేజ్, 4Gతో చౌకైన స్మార్ట్‌ఫోన్
-
IIT Kharagpur: ఐఐటీ ఖరగ్‌పూర్‌లో విషాదం.. హైదరాబాద్‌కి చెందిన ప్రొఫెసర్ అనుమానాస్పద మృతి
-
Ather Pothole+ Alerts: ఏథర్ స్కూటర్లకు కీలక అప్డేట్.. గుంతలు, స్పీడ్ బంప్లపై ముందే అలర్ట్! ఎలా పనిచేస్తుందంటే?
-
Vijay Deverakonda: సోలో హీరోగా పదేళ్లు.. ఫ్లాపులు వచ్చినా ఫ్యాన్ బేస్ తగ్గని ఏకైక స్టార్ విజయ్ దేవరకొండేనా?
-
Rajni – Kamal Haasan : రజనీకాంత్, కమల్ హాసన్‌తో సినిమా అంటే దర్శకులకు తలనొప్పి తప్పదా
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: నేను ఏ బౌలర్‌కు భయపడను.. వారే నన్ను చూసి వణికిపోతున్నారు!
-
Health Tips : వర్షాకాలంలో గొంతు నొప్పా? ఈ అల్లం-బెల్లం కషాయం ట్రై చేయండి.!
-
Protein Tips : పనీర్ తింటున్నారా? పచ్చిదా.. వండిందా.. ఏది బెస్ట్.?
-
7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో వచ్చేస్తున్న బడ్జెట్ ఫోన్ OnePlus N6x.!
-
AI ఫీచర్లు, Intel Core Ultra ప్రాసెసర్లతో Dell XPS 13, Dell 14S, Dell 16S, Alienware 15 ల్యాప్‌టాప్‌లు లాంచ్..!