Virat Kohli-IPL 2024: ఆర్సీబీకి శుభవార్త.. ‘కింగ్’ కోహ్లీ వచ్చేస్తున్నాడు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Virat Kohli To Join RCB Squad On March 17: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 17వ సీజన్ మరో 9 రోజుల్లో ఆరంభం కానుంది. మార్చి 22న చెపాక్‌లోని ఎంఏ చిదంబరం స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్‌తో మెగా టోర్నీకి తెరలేవనుంది. ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు ప్రాక్టీస్ చేస్తున్నాయి. ఈ సమయంలో ఆర్సీబీకి ఓ శుభవార్త. వ్యక్తిగత కారణాలతో గత రెండు నెలలుగా మైదానంలోకి దిగని టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ.. మరో నాలుగు రోజుల్లో ఆర్సీబీ జట్టులో చేరనున్నాడు.
ప్రస్తుతం లండన్‌లో ఉన్న విరాట్ కోహ్లీ.. మార్చి 17న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులో చేరనున్నాడని తెలుస్తోంది. మార్చి 19న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలోని ఆర్సీబీ జెర్సీ రీవీల్ కార్యక్రమంలో విరాట్ పాల్గొననున్నాడట. 17వ సీజన్ కోసం ఇప్పటికే ఆర్సీబీ ప్లేయర్స్ అందరూ ట్రైనింగ్ క్యాంప్‌లో చేరారు. ఇటీవలే కెప్టెన్ ఫాప్ డుప్లెసిస్ సైతం జట్టుతో కలిశాడు. ఈ సారైనా కప్ సాధించాలని ఆర్సీబీ భావిస్తోంది. గత 16 సీజన్లలో బెంగళూరు జట్టు ఒక్కసారి కూడా టైటిల్ సాధించని విషయం తెలిసిందే.
Also Read
- CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
- Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
- India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
Also Read: WPL 2024: చరిత్ర సృష్టించిన ఎలీస్ పెర్రీ!
క్రికెటర్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్క శర్మలు రెండోసారి తల్లిదండ్రులైన విషయం తెలిసిందే. 2024 ఫిబ్రవరి 15న లండన్‌లోని ఓ ఆసుపత్రిలో అనుష్క పండంటి మగబిడ్డకు జన్మినిచ్చారు. తమ కుమారుడికి ‘అకాయ్’ అని నామకరణం చేసినట్లు విరాట్ తెలిపాడు. ప్రస్తుతం కోహ్లీ తన కుటుంబంతో కలిసి లండన్‌లో ఉన్నాడు. వ్యక్తిగత కారణాలతో ఇంగ్లండ్ సిరీస్ మొత్తానికి కోహ్లీ దూరమయ్యాడు. మొదటి రెండు టెస్టులకు జట్టుకు ఎంపికైన విరాట్.. తొలి టెస్ట్ కోసం హైదరాబాద్ కూడా వచ్చాడు. అయితే వెంటనే ఇంటికి వెళ్ళిపోయాడు. మూడో టెస్ట్ నుంచి జట్టుకు అందుబాటులో ఉంటాడనుకున్నా.. అది జరగలేదు.
తాజావార్తలు
-
India Flagged Cargo Ship Attack: యెమెన్ తీరంలో భారత కార్గో నౌకపై దాడి.. ఘటన సమయంలో 14 మంది సిబ్బంది..!
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!