NTV Telugu Site icon

IPL 2024: ఐపీఎల్ హిస్టరీలో మునుపెన్నడూ చూడని రికార్డు.. అదరకొడుతున్న భారత యువ బ్యాటర్లు..

Ipl 2024

Ipl 2024

ఐపీఎల్ 2024 మునుపెన్నడూ లేని విధంగా హై టెన్షన్ మ్యాచ్‌ లకు ఆతిధ్యం ఇస్తుంది. బ్యాటర్ల దూకుడికి బౌలర్లు బెంబేలెత్తిపోతున్నారు. ఈ సీజన్‌లో ఇప్పటికే అనేక రికార్డులు బద్దలు కొట్టిన మ్యాచ్ లు జరిగాయి. కొన్ని గొప్ప థ్రిల్లింగ్ మ్యాచ్‌లు, చివరి బంతి వరకు ఫలితం తేలే మ్యాచ్ లు కూడా జరుగుతున్నాయి. చివరి బంతి వరకు ఎన్నో ఉత్కంఠభరితమైన మ్యాచ్ లు జరుగుతున్నాయి. గురువారం సాయంత్రం సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మధ్య ఇలాంటి మ్యాచ్ జరిగింది. దీంతో సన్‌రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 201 పరుగులు చేసింది. ఈ సీజన్‌లో అంత పెద్ద హైస్కోరింగ్ మ్యాచ్ కానప్పటికీ , ఐపీఎల్ చరిత్రలో ఈ మ్యాచ్ లో ఓ అపూర్వమైన రికార్డు నెలకొంది.

Also Read: Amitabh – Rajinikanth: ఇద్దరు సూపర్ స్టార్స్ కలిసిన వేళ..

ఈ మ్యాచ్‌ లో 23 ఏళ్లలోపు ఉన్న ముగ్గురు భారత ఆటగాళ్లు హాఫ్ సెంచరీలు సాధించారు. సన్‌రైజర్స్‌ నుండి నితీష్ రెడ్డి, రాజస్థాన్ రాయల్స్‌లో యశస్వి జైస్వాల్, ర్యాన్ పరాగ్ లు 50కి పైగా పరుగులు చేశారు. ఐపీఎల్ గణాంకాల ప్రకారం., ఏ ముగ్గురు 23 ఏళ్లలోపు ఆటగాళ్లు ఒక గేమ్‌లో 50 కంటే ఎక్కువ పరుగులు చేయలేదు. ఇప్పటి వరకు ఐపీఎల్ హిస్టరీలో 1075 మ్యాచ్‌ లు జరగగా, తొలిసారిగా ఈ రికార్డు నమోదైంది.

Also Read: MI vs KKR: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ముంబై ఇండియన్స్..

ఈ గేమ్‌లో నితీష్ రెడ్డి 42 బంతుల్లో 76 పరుగులు చేయగా, రాజస్థాన్ స్టార్ బ్యాట్స్‌మెన్ యశసవి జైస్వాల్ 40 బంతుల్లో 67 పరుగులు, రియాన్ పరాగ్ 49 బంతుల్లో 77 పరుగులు చేసారు.