NTV Telugu Site icon

SRH vs MI: ముంబైతో సన్‌రైజర్స్‌ ఢీ.. ఉప్పల్‌లో బోణీ కొట్టేదెవరో!

Srh Vs Mi Prediction

Srh Vs Mi Prediction

IPL 2024 SRH vs MI Prediction and Playing 11: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) 2024లో భాగంగా నేడు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, ముంబై ఇండియన్స్‌ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. భాగ్యనగరంలోని ఉప్పల్‌ స్టేడియంలో నేటి రాత్రి జరిగే మ్యాచ్‌లో ఈ రెండు జట్లు ఢీ కొట్టనున్నాయి. తమ తొలి మ్యాచ్‌లు ఓడిన హైదరాబాద్‌, ముంబై టీమ్‌లూ సీజన్‌లో బోణీపై గురి పెట్టాయి. వారాంతం కానీ, సెలవు దినం కానీ కాకపోయినా.. చాలా రోజుల తర్వాత ఉప్పల్‌లో ఐపీఎల్ మ్యాచ్ జరుగుతుండడంతో మైదానంకు అభిమానులు పోటెత్తనున్నారు. మరి ఉప్పల్‌లో బోణీ కొట్టేదెవరో మరికొన్ని గంటల్లో తేలిపోనుంది.

కోల్‌కతా నైట్‌ రైడర్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్ ఓడిపోయింది. హెన్రిచ్‌ క్లాసెన్‌, షాబాజ్‌ అహ్మద్‌ జట్టును ఆదుకునే ప్రయత్నం చేసినా కుదరలేదు. టాప్‌ ఆర్డర్‌లో మయాంక్‌ అగర్వాల్‌, అభిషేక్‌ శర్మ, రాహుల్‌ త్రిపాఠి, ఐడెన్ మార్‌క్రమ్‌ దూకుడు పెంచితే తిరుగుండదు. భీకరమైన బ్యాటింగ్‌ లైనప్‌ కలిగిన ముంబైకి సన్‌రైజర్స్‌ బౌలింగ్‌ పరీక్షగా నిలువనుంది. భువనేశ్వర్‌ కుమార్, మార్కో యాన్సన్‌, టీ నటరాజన్‌, ప్యాట్ కమిన్స్‌లతో బలమైన బౌలింగ్‌ ఉంది. ఈ సీజన్‌లో సొంతగడ్డపై సన్‌రైజర్స్‌కు ఇదే మొదటి మ్యాచ్‌.

గుజరాత్‌ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఓటమి పాలైంది. కోల్‌కతాతో మ్యాచ్‌లో రోహిత్‌, బ్రెవిస్‌ సత్తాచాటినా మిగతా వాళ్లు విఫలమయ్యారు. ఇషాన్‌ కిషన్‌, నమన్‌ ధీర్‌, తిలక్‌ వర్మ, టిమ్‌ డేవిడ్‌, హార్దిక్‌ పాండ్యా ఫామ్‌లోకి రావాల్సి ఉంది. ఇక పీయూష్ చావ్లా, గెరాల్డ్ కోయెట్జీ, ల్యూక్ వుడ్, జస్ప్రీత్ బుమ్రాలతో బౌలింగ్ పటిష్టంగానే ఉంది. ఇక ఐపీఎల్‌లో రెండు జట్లు ఇప్పటివరకు 21 మ్యాచ్‌లు ఆడగా.. సన్‌రైజర్స్‌ 9, ముంబై 12 మ్యాచ్‌లు గెలిచాయి. చివరి 5 మ్యాచ్‌ల్లో నాలుగుసార్లు ముంబై గెలిచింది.

Also Read: What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

తుది జట్లు (అంచనా):
హైదరాబాద్: మయాంక్ అగర్వాల్, రాహుల్ త్రిపాఠి, ఎయిడెన్ మార్క్‌రమ్, హెన్రిచ్ క్లాసెన్, అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, మార్కో జేన్సన్, ప్యాట్ కమిన్స్, భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే, నటరాజన్.
ముంబై: రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, నమన్ ధీర్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), టిమ్ డేవిడ్, షమ్స్ ములానీ, పీయూష్ చావ్లా, గెరాల్డ్ కోయెట్జీ, జస్ప్రీత్ బుమ్రా, ల్యూక్ వుడ్.

Show comments