NTV Telugu Site icon

IPL Retentions 2024: ఇద్దరు స్టార్ ఆటగాళ్లను రిలీజ్‌ చేసిన సన్‌రైజర్స్‌.. ఎస్‌ఆర్‌హెచ్‌ రిలీజ్, రిటెన్షన్ లిస్ట్ ఇదే!

Srh

Srh

SRH Sunrisers Hyderabad full list of players retained, released: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024 వేలం డిసెంబర్ 19న దుబాయ్‌లో జరగనుంది. ఐపీఎల్ 2024 వేలంకు ముందు 10 ప్రాంచైజీలకు బీసీసీఐ విధించిన గడువు (రిటెన్షన్‌, రిలీజ్‌ ప్రక్రియ) ఆదివారం పూర్తవడంతో.. అన్ని టీమ్స్ ప్లేయర్స్ లిస్ట్‌ను ప్రకటించాయి. ఈ క్రమంలో తెలుగు జట్టు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (ఎస్‌ఆర్‌హెచ్‌) తన రిటెన్షన్‌, రిలీజ్‌ జాబితాను ప్రకటించింది. ఐడెన్ మార్‌క్రమ్‌ మరోసారి ఆరెంజ్ ఆర్మీ బాధ్యతలు చేపట్టనున్నాడని పేర్కొంది.

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఇద్దరు స్టార్ ఆటగాళ్లకు గుడ్‌బై చెప్పింది. ఐపీఎల్ 2023 వేలంలో 13 కోట్లు పెట్టి కొనుగోలు చేసిన ఇంగ్లండ్ ప్లేయర్ హ్యారీ బ్రూక్‌కు అల్విదా చెప్పింది. గత ఎడిషన్‌లో బ్రూక్‌ ఒక సెంచరీ మినహా.. పెద్దగా రాణించలేదు. దాంతో అతడికి గుడ్‌బై చెప్పింది. మరో ఇంగ్లండ్ ప్లేయర్ ఆదిల్‌ రషీద్‌ను కూడా వేలానికి వదిలేసింది. కార్తీక్‌ త్యాగీ, అకీల్‌ హొసేన్‌ లాంటి ఆటగాళ్లతో కూడా ఎస్‌ఆర్‌హెచ్‌ తెగదెంపులు చేసుకుంది. గత ఎడిషన్‌లో విఫలమయిన టి నటరాజన్‌, మయాంక్‌ అగర్వాల్‌లను మాత్రం కొనసాగించింది.

రిలీజ్‌ ప్లేయర్స్ లిస్ట్:
హ్యారీ బ్రూక్‌
ఆదిల్‌ రషీద్‌
సమర్థ్‌ వ్యాస్‌
కార్తీక్‌ త్యాగీ
వివ్రాంత్‌ శర్మ
అకీల్‌ హొసేన్‌

Also Read: IPL 2024 Retentions: స్టోక్స్‌, రాయుడుకు గుడ్‌బై.. చెన్నై రిలీజ్, రిటెన్షన్ ప్లేయర్స్ లిస్ట్ ఇదే!

రిటైన్‌ ప్లేయర్స్ లిస్ట్:
ఎయిడెన్‌ మార్క్రమ్‌ (కెప్టెన్‌)
అబ్దుల్‌ సమద్‌
రాహుల్‌ త్రిపాఠి
గ్లెన్‌ ఫిలిప్స్‌
హెన్రిచ్‌ క్లాసెన్‌
మయాంక్‌ అగర్వాల్‌
అన్మోల్‌ప్రీత్‌ సింగ్‌
ఉపేంద్ర సింగ్‌ యాదవ్‌
నితీశ్‌ కుమార్‌ రెడ్డి
షాబాజ్‌ అహ్మద్‌ (ఆర్సీబీ ట్రేడింగ్‌)
అభిషేక్‌ శర్మ
మార్కో జన్సెన్‌
వాషింగ్టన్‌ సుందర్‌
సన్వీర్‌ సింగ్‌
భువనేశ్వర్‌ కుమార్‌
టి నటరాజన్‌
మయాంక్‌ మార్కండే
ఉమ్రాన్‌ మాలిక్‌
ఫజల్‌ హక్‌ ఫారూకీ