NTV Telugu Site icon

IPL Retentions: ఏకంగా 11 మందిని వదిలేసిన ముంబై ఇండియన్స్.. స్టార్‌ బౌలర్‌కు గుడ్‌బై!

Mumbai Indians

Mumbai Indians

Full List Of Players Retained And Released By Mumbai Indians: రిటెన్షన్, రిలీజ్ ప్లేయర్స్ లిస్ట్ ప్రకటించేందుకు ఐపీఎల్ ప్రాంచైజీలకు బీసీసీఐ విధించిన గడువు (నవంబర్ 26) ముగిసిపోయింది. దాంతో ఐపీఎల్‌ 2024 సీజన్‌కు ముందు అన్ని జట్లు తమ రిటెన్షన్, రిలీజ్ ప్లేయర్స్ జాబితాను విడుదల చేశాయి. ఈ క్రమంలో 5 సార్లు ఛాంపియన్ ముంబై ఇండియన్స్‌ ఏకంగా 11 మంది ఆటగాళ్లను వేలానికి వదిలేసింది. కెప్టెన్‌గా రోహిత్‌ శర్మను కొనసాగించిన ముంబై.. స్టార్‌ బౌలర్‌ జోఫ్రా ఆర్చర్‌కు మాత్రం షాక్ ఇచ్చింది. గాయంతో కొంత కాలంగా ఇబ్బంది పడుతూ వచ్చిన ఆర్చర్.. ఈ ఏడాది పెద్దగా ప్రభావం చూపలేదు. ఆర్చర్‌తో పాటు మరో 10 మందిని ముంబై వేలానికి వదిలేసింది.

గతేడాది జరిగిన మినీ వేలంలో భారీ ధరకు కొనుగోలు చేసిన ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్‌ను (Cameron Green IPL Trade) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి ముంబై ఇండిస్ ట్రేడ్ ద్వారా అమ్మేసింది. పూర్తి క్యాష్‌కు గ్రీన్‌ను ట్రేడ్ చేసినట్లు తెలుస్తోంది. ఇందుకు పెద్ద కారణమే ఉంది. గ్రీన్ ట్రేడింగ్ ద్వారా వచ్చిన డబ్బుతో.. గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాను తిరిగి జట్టులోకి తీసుకోనుంది. జై రిచర్డ్‌సన్, క్రిస్ జోర్డాన్, ట్రిస్టియన్ స్టబ్స్ వంటి కీలక విదేశీ ప్లేయర్లను కూడా ముంబై వదిలేసింది.

రిలీజ్ ప్లేయర్స్ లిస్ట్:
క్రిస్ జోర్డాన్
జోఫ్రా ఆర్చర్‌
డువాన్ జన్సెన్
హృతిక్ షోకీన్
అర్షద్ ఖాన్
రమణదీప్ సింగ్
రాఘవ్ గోయల్
ట్రిస్టన్ స్టబ్స్
జై రిచర్డ్‌సన్
రిలే మెరిడిత్
సందీప్ వారియర్

Also Read: Hardik Pandya: గుజరాత్‌ టైటాన్స్‌కు కాదు.. ముంబై ఇండియన్స్‌కే హార్దిక్‌ పాండ్యా!

రిటెన్షన్ ప్లేయర్స్ లిస్ట్:
రోహిత్ శర్మ (కెప్టెన్)
జస్ప్రీత్ బుమ్రా
సూర్యకుమార్ యాదవ్
ఇషాన్ కిషన్
పీయూష్ చావ్లా
డెవాల్డ్ బ్రెవిస్
తిలక్ వర్మ
టిమ్ డేవిడ్
రొమారియో షెపర్డ్ (ట్రేడింగ్‌)
అర్జున్ టెండూల్కర్
విష్ణు వినోద్
నేహాల్ వధేరా
షమ్స్ ములానీ
కుమార్ కార్తికేయ
ఆకాష్ మధ్వల్
జాసన్ బెహ్రెండార్ఫ్

Show comments