IPL Retentions: ఏకంగా 11 మందిని వదిలేసిన ముంబై ఇండియన్స్.. స్టార్ బౌలర్‌కు గుడ్‌బై!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Full List Of Players Retained And Released By Mumbai Indians: రిటెన్షన్, రిలీజ్ ప్లేయర్స్ లిస్ట్ ప్రకటించేందుకు ఐపీఎల్ ప్రాంచైజీలకు బీసీసీఐ విధించిన గడువు (నవంబర్ 26) ముగిసిపోయింది. దాంతో ఐపీఎల్ 2024 సీజన్‌కు ముందు అన్ని జట్లు తమ రిటెన్షన్, రిలీజ్ ప్లేయర్స్ జాబితాను విడుదల చేశాయి. ఈ క్రమంలో 5 సార్లు ఛాంపియన్ ముంబై ఇండియన్స్ ఏకంగా 11 మంది ఆటగాళ్లను వేలానికి వదిలేసింది. కెప్టెన్‌గా రోహిత్ శర్మను కొనసాగించిన ముంబై.. స్టార్ బౌలర్ జోఫ్రా ఆర్చర్‌కు మాత్రం షాక్ ఇచ్చింది. గాయంతో కొంత కాలంగా ఇబ్బంది పడుతూ వచ్చిన ఆర్చర్.. ఈ ఏడాది పెద్దగా ప్రభావం చూపలేదు. ఆర్చర్‌తో పాటు మరో 10 మందిని ముంబై వేలానికి వదిలేసింది.
గతేడాది జరిగిన మినీ వేలంలో భారీ ధరకు కొనుగోలు చేసిన ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్‌ను (Cameron Green IPL Trade) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి ముంబై ఇండిస్ ట్రేడ్ ద్వారా అమ్మేసింది. పూర్తి క్యాష్‌కు గ్రీన్‌ను ట్రేడ్ చేసినట్లు తెలుస్తోంది. ఇందుకు పెద్ద కారణమే ఉంది. గ్రీన్ ట్రేడింగ్ ద్వారా వచ్చిన డబ్బుతో.. గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాను తిరిగి జట్టులోకి తీసుకోనుంది. జై రిచర్డ్‌సన్, క్రిస్ జోర్డాన్, ట్రిస్టియన్ స్టబ్స్ వంటి కీలక విదేశీ ప్లేయర్లను కూడా ముంబై వదిలేసింది.
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
రిలీజ్ ప్లేయర్స్ లిస్ట్:
క్రిస్ జోర్డాన్
జోఫ్రా ఆర్చర్
డువాన్ జన్సెన్
హృతిక్ షోకీన్
అర్షద్ ఖాన్
రమణదీప్ సింగ్
రాఘవ్ గోయల్
ట్రిస్టన్ స్టబ్స్
జై రిచర్డ్‌సన్
రిలే మెరిడిత్
సందీప్ వారియర్
Also Read: Hardik Pandya: గుజరాత్ టైటాన్స్‌కు కాదు.. ముంబై ఇండియన్స్‌కే హార్దిక్ పాండ్యా!
రిటెన్షన్ ప్లేయర్స్ లిస్ట్:
రోహిత్ శర్మ (కెప్టెన్)
జస్ప్రీత్ బుమ్రా
సూర్యకుమార్ యాదవ్
ఇషాన్ కిషన్
పీయూష్ చావ్లా
డెవాల్డ్ బ్రెవిస్
తిలక్ వర్మ
టిమ్ డేవిడ్
రొమారియో షెపర్డ్ (ట్రేడింగ్)
అర్జున్ టెండూల్కర్
విష్ణు వినోద్
నేహాల్ వధేరా
షమ్స్ ములానీ
కుమార్ కార్తికేయ
ఆకాష్ మధ్వల్
జాసన్ బెహ్రెండార్ఫ్
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!