Full list of players retained and released by Chennai Super Kings: ఐపీఎల్ 2024కి సంబంధించి ఆటగాళ్ల రిటెన్షన్, రిలీజ్ ప్రక్రియకు ఆదివారం (నవంబర్ 26) ఆఖరి తేదీ కావడంతో.. అన్ని ఫ్రాంచైజీలు ఆటగాళ్ల జాబితాను ప్రకటించాయి. అన్ని ఫ్రాంచైజీల కంటే ముందుగా చెన్నై సూపర్ కింగ్స్ తమ రిలీజ్ ఆటగాళ్ల జాబితాను ప్రకటించింది. ముఖ్యంగా సీఎస్‌కే ముగ్గురు స్టార్ ఆటగాళ్లకు అల్విదా చెప్పింది. కోట్లు కుమ్మరించి కొనుక్కున్న బెన్ స్టోక్స్ (16.25 కోట్లు), తెలుగు తేజం అంబటి రాయుడు (6.75), పేసర్ కైల్ జేమీసన్‌ను (1 కోటి) రిలీజ్ చేసింది.
చెన్నై సూపర్ కింగ్స్ మరో ఐదుగురికి కూడా గుడ్‌బై చెప్పింది. విదేశీ ఆటగాళ్లు డ్వేన్ ప్రిటోరియస్ (50 లక్షలు), సిసండ మగాల (50 లక్షలు).. లోకల్ ప్లేయర్స్ ఆకాశ్ సింగ్ (20 లక్షలు), భగత్ వర్మ (20 లక్షలు), సుభ్రాన్షు సేనాపతిలను (20 లక్షలు) రిలీజ్ చేసింది. భారత్ మాజీ సారధి ఎంఎస్ ధోనీ తమ కెప్టెన్ అని స్పష్టం చేసింది. దాంతో రికార్డు స్థాయిలో 15వ సారి చెన్నైకి కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఇపుడు సీఎస్‌కే పర్స్‌లో 32.2 కోట్లు ఉన్నాయి. చెన్నైకి ఆరుగురిని కొనుగోలు చేసే అవకాశం ఉండగా.. ముగ్గురు విదేశీ ఆటగాళ్లకు ఛాన్స్ ఉంది.
రిలీజ్ ప్లేయర్స్ లిస్ట్:
బెన్ స్టోక్స్ (16.25 కోట్లు)
అంబటి రాయుడు (6.75 కోట్లు)
కైల్ జేమీసన్ (1 కోటి)
డ్వేన్ ప్రిటోరియస్ (50 లక్షలు)
సిసండ మగాల (50 లక్షలు)
ఆకాశ్ సింగ్ (20 లక్షలు)
భగత్ వర్మ (20 లక్షలు)
సుభ్రాన్షు సేనాపతి (20 లక్షలు)
Also Read: IPL Retentions: ఏకంగా 11 మందిని వదిలేసిన ముంబై ఇండియన్స్.. స్టార్ బౌలర్‌కు గుడ్‌బై!
రిటైన్ ప్లేయర్స్ లిస్ట్:
ఎంఎస్ ధోనీ (కెప్టెన్)
డెవాన్ కాన్వే
రుతురాజ్ గైక్వాడ్
అజింక్య రహానే
షేక్ రషీద్
రవీంద్ర జడేజా
మిచెల్ సాంట్నర్
మొయిన్ అలీ
శివమ్ దూబే
నిషాంత్ సింధు
అజయ్ మండల్
రాజ్‌వర్ధన్ హంగార్గేకర్
దీపక్ చహర్
మహీష తీక్షణ
ముకేశ్ చౌదరీ
ప్రశాంత్ సోలంకి
సిమ్రన్‌జీత్ సింగ్
తుషార్‌దేశ్ పాండే
మతీశ పతిరణ