NTV Telugu Site icon

IPL 2024: ముంబై ఇండియన్స్ ఎంత కసితో ఉందో అర్థమవుతోంది: అశ్విన్

R Ashwin Rr

R Ashwin Rr

R Ashwin React on Hardik Pandya Captaincy: హార్దిక్‌ పాండ్యా నాయకత్వంలో ముంబై ఇండియన్స్ జట్టు ఆరో టైటిల్‌పై కన్నేసిందని టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తెలిపాడు. భారీ మొత్తం వెచ్చించి పాండ్యాను కొనుగోలు చేయడం చూస్తే.. టైటిల్‌ కోసం ముంబై ఎంతటి కసితో ఉందో అర్థమవుతోందన్నాడు. ఐపీఎల్‌ చరిత్రలో అత్యధికసార్లు విజేతగా నిలిచిన మొదటి జట్టు ముంబై అన్న విషయం తెలిసిందే. ఐదుసార్లు ఛాంపియన్‌ అయిన ముంబైని గతేడాది చెన్నై సూపర్ కింగ్స్ సమం చేసింది. ఆరోసారి టైటిల్‌ నెగ్గాలనే లక్ష్యంతో ఈసారి ముంబై బరిలోకి దిగుతోంది.

ఆర్ అశ్విన్ తన యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడుతూ… ‘ముంబై ఇండియన్స్ జట్టు ఆరో టైటిల్‌పై కన్నేసింది. చాలా మంది కెప్టెన్సీ గురించి మాట్లాడుతున్నారు. అక్కని నేను మాత్రం ఆ విషయంపై స్పందించను. భారీ మొత్తం వెచ్చించి హార్దిక్ పాండ్యాను కొనుగోలు చేయడం చూస్తే.. టైటిల్‌ కోసం ముంబై ఎంతటి కసితో ఉందో అర్థమవుతోంది. ఒకవేళ హార్దిక్ బదులు రషీద్ ఖాన్‌ను తీసుకుంటే.. ఎవరూ ఇంతలా చర్చించరు’ అని అన్నాడు.

Also Read: RCB vs CSK: చెన్నై vs బెంగళూరు.. హెడ్ టు హెడ్ రికార్డ్స్ ఇవే!

హార్దిక్ పాండ్యా తన ఐపీఎల్ కెరీర్‌ను ముంబై ఇండియన్స్‌తో ప్రారంభించాడు. 2015లో ముంబై తరఫున ఐపీఎల్‌లోకి అరంగేట్రం చేసి.. మంచి ఆల్‌రౌండర్‌గా ఎదిగాడు. ముంబై తరఫున 7 సీజన్లు ఆడిన హార్దిక్.. 2022 వేలంలో కొత్త ఫ్రాంచైజీ గుజరాత్ టైటాన్స్‌లోకి వెళ్లాడు. తన అద్భుత సారథ్యంతో గుజరాత్ జట్టుకు తొలి ప్రయత్నంలోనే టైటిల్ అందించాడు. 2023లో రన్నరప్‌గా నిలిపాడు. ఐపీఎల్ 2024కు ముందు ముంబై జట్టులోకి తిరిగి వచ్చాడు. రోహిత్ శర్మ స్థానంలో కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాడు. ఈ సీజన్‌లో ముంబైకి కప్ అందించాలని హార్దిక్ చూస్తున్నాడు. ఐపీఎల్‌ 2024లో ముంబై తన తొలి మ్యాచ్‌లో మార్చి 23న గుజరాత్‌తోనే తలపడనుంది.