NTV Telugu Site icon

IPL 2024 – PBKS vs DC: అందరి దృష్టి రిషబ్ పంత్‌ పైనే.. మరి ఫలితం ఏమిటో..?!

6

6

గత ఐపీఎల్ లో పేలవమైన ప్రదర్శనను కనపరిచిన ఇరుజట్లు ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ ఈ సీజన్ ను మంచి శుభారంభం చేయాలని భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో శనివారం తలపడేందుకు రంగం సిద్ధమైంది. ఈ మ్యాచ్‌ మధ్యాహ్నం 3.30 గంటలకు మొహాలిలోని ముల్లన్‌ పూర్‌ లో కొత్తగా నిర్మించిన మహారాజా యదవీంద్ర సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్ లో అందరి దృష్టి రిషబ్ పంత్‌ పైనే ఉంటుంది. డిసెంబర్ 2022లో జరిగిన కారు ప్రమాదంలో పంత్ తీవ్రంగా గాయపడ్డ తర్వాత బలమైన సంకల్పం కారణంతో అందులోంచి కోలుకొని దాదాపు 15 నెలల సుదీర్ఘ విరామం తర్వాత పంత్ ఐపీఎల్ ద్వారా క్రికెట్‌ లోకి తిరిగి రాబోతున్నాడు.

Ipl New Ad2024

ఇక ఈ ఇరు జట్లు 2008లో ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచి పీబీకేఎస్, డీసీలు 32 సార్లు తలపడ్డాయి. అయితే ఇరు జట్లు 16 మ్యాచ్‌ల్లో విజయం సాధించాయి. కాకపోతే చివరి ఐదు మ్యాచ్‌లలో నాలుగింటిలో ఢిల్లీ పంజాబ్ పై ఆధిపత్యం చెలాయించింది. శిఖర్ ధావన్ నాయకత్వంలో , పంజాబ్ ఈ ఐపీల్ లో తమ అదృష్టాన్ని మార్చుకోవాలని అనుకుంటోంది. తొలి టైటిల్ కోసం పోటీపడాలని లక్ష్యంగా పెట్టుకుంది. ధావన్ అనుభవం, దూకుడు బ్యాటింగ్ తో పాటు నాయకత్వ లక్షణాలతో పంజాబ్ ని విజయం వైపు నడిపించడంలో కీలక వ్యక్తిగా మారనున్నాడు.

Also Read: Virat Kohli: ఐపీఎల్‌లో కోహ్లీ అరుదైన రికార్డు.. చరిత్ర సృష్టించాడు..

ఢిల్లీ క్యాపిటల్స్‌కు కెప్టెన్‌ రిషబ్ పంత్ వికెట్ కీపర్ కం బ్యాట్స్‌మెన్‌గా ఆడేందుకు అనుమతి పొందాడు. గత సీజన్‌ లో, పంత్ లేకపోవడంతో, డేవిడ్ వార్నర్ జట్టుకు కెప్టెన్‌ గా సేవలందించారు. కాకపోతే చివరి సీజన్ లో ఏకంగా జట్టు 9వ స్థానంలో నిలిచింది. మ్యాచ్‌ కు ముందు ఢిల్లీ కోచ్ రికీ పాంటింగ్ మాట్లాడుతూ.., “ఈసారి ఐపీఎల్‌ కు ముందు పంత్ బ్యాటింగ్‌ ప్రాక్టీస్ ఎక్కువ చేసి ఉండకపోవచ్చు. అతను అదే ఫాంను తిరిగి పొందాలని చూస్తున్నాడు’ అంటూ చెప్పుకొచ్చాడు. ఇక టీం విషయానికి వస్తే..

Also Read: IPL 2024 – KKR vs SRH: ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన ఇద్దరు ఆటగాళ్లు తలపడితే..?

ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు : డేవిడ్ వార్నర్, పృథ్వీ షా, మిచెల్ మార్ష్, రిషబ్ పంత్, కుమార్ కుశాగ్రా, ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, ఖలీల్ అహ్మద్, ముఖేష్ కుమార్, అన్రిచ్ నోర్ట్జే.

పంజాబ్ కింగ్స్ జట్టు: శిఖర్ ధావన్, ప్రభసిమ్రాన్ సింగ్, జానీ బెయిర్‌స్టో, అథర్వ తైదే, లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ, సికందర్ రజా, హర్షల్ పటేల్, రాహుల్ చాహర్, కగిసో రబడ, అర్ష్దీప్ సింగ్.