NTV Telugu Site icon

MI vs RR Dream 11 Prediction: ముంబై vs గుజరాత్ డ్రీమ్ 11 టీమ్.. కెప్టెన్, వైస్ కెప్టెన్ టిప్స్!

Mi Vs Rr Dream 11 Team

Mi Vs Rr Dream 11 Team

IPL 2024 MI vs RR Dream11 Prediction: ఐపీఎల్‌ 2024లో భాగంగా ఈరోజు ముంబై ఇండియన్స్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ జట్లు తలపడనున్నాయి. ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఈ మ్యాచ్‌ రాత్రి 7.30 గంటలకు ఆరంభం కానుంది. 17వ సీజన్‌లో రాజస్థాన్‌ ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌ల్లో గెలిచి ఊపుమీదుంది. అదే ఊపులో ఈ మ్యాచ్‌లో కూడా గెలవాలని చూస్తోంది. మరోవైపు ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఓడిన ముంబై.. బోణి కొట్టాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో మ్యాచ్ రసవత్తరంగా సాగే అవకాశాలు ఉన్నాయి.

ముంబై ఇండియన్స్‌కు సొంత మైదానంలో ఇదే మొదటి మ్యాచ్. దాంతో ముంబై ఆటగాళ్లపై భారీ అంచనాలు ఉన్నాయి. కొత్త కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా నేతృత్వంలో ముంబై తొలిసారి హోం గ్రౌండ్‌లో మ్యాచ్‌ ఆడుతుంది. హార్దిక్‌ను కెప్టెన్‌గా స్వీకరించలేకపోతున్న రోహిత్‌ శర్మ ఫాన్స్.. వాంఖడేలో ఎలా ప్రవర్తిస్తారో చూడాలి. రోహిత్ మైదానంలోకి రాగానే అరుపులు, కేకలు ఖాయం. మరోవైపు రాజస్థాన్‌ ప్రత్యర్ధి గ్రౌండ్‌లో తొలి మ్యాచ్‌ ఆడుతుంది. దాంతో ఈ మ్యాచ్‌లో సంజూ సేన ఏ మేరకు రాణిస్తుందో చూడాలి.

ముంబై ఇండియన్స్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ ఇప్పటివరకు 28 మ్యాచ్‌లలో తలపడ్డాయి. ఇందులో ముంబై 15, రాజస్థాన్‌ 12 మ్యాచ్‌ల్లో గెలిచాయి. ఓ మ్యాచ్‌లో ఫలితం రాలేదు. ఇరు జట్ల మధ్య చివరిగా జరిగిన ఐదు మ్యాచ్‌ల్లో ముంబై ఏకంగా నాలుగు గెలిచింది. ఈ మ్యాచ్‌కు వర్ష సూచన లేదు. వాంఖడే స్టేడియం బ్యాటింగ్ వికెట్. బౌండరీ కూడా కాస్త తక్కువగా ఉండడంతో.. ఇక్కడ బ్యాటర్లు పండగ చేసుకుంటారు. పిచ్ స్వింగ్ మరియు బౌన్స్‌ను అందిస్తుంది కాబట్టి కొత్త బంతితో ఫాస్ట్ బౌలర్లు పై చేయి సాధించే అవకాశం ఉంటుంది. ఈ మ్యాచ్ లైవ్ స్ట్రీమింగ్ ‘జియో సినిమా’ యాప్‌లో ఫ్రీగా చూడొచ్చు.

తుది జట్లు (అంచనా):
ముంబై ఇండియన్స్‌: రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ (కీపర్‌), నమన్ ధీర్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (కెప్టెన్‌), టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, గెరాల్డ్ కోయెట్జీ, పీయూష్ చావ్లా, జస్ప్రీత్ బుమ్రా, క్వేన మఫాకా.
రాజస్థాన్‌ రాయల్స్‌: యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజు శాంసన్ (కెప్టెన్‌/కీపర్‌), రియాన్ పరాగ్, షిమ్రోన్ హెట్‌మైర్, ధ్రువ్ జురెల్, ఆర్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, యుజ్వేంద్ర చహల్, సందీప్ శర్మ, అవేష్ ఖాన్.

డ్రీమ్ 11 టీమ్:
కీపర్లు – ఇషాన్ కిషన్, సంజు శాంసన్
బ్యాట్స్‌మెన్ – రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్ (వైస్ కెప్టెన్), జోస్ బట్లర్, తిలక్ వర్మ
ఆల్ రౌండర్లు – ఆర్ అశ్విన్, హార్దిక్ పాండ్యా, రియాన్ పరాగ్, నమన్ ధీర్
బౌలర్ – జస్ప్రీత్ బుమ్రా

Show comments