NTV Telugu Site icon

IPL 2024 LSG vs PBKS: లక్నో సూపర్ జెయింట్స్ మొదటి విజయాన్ని అందుకుంటుందా..?!

1

1

లక్నోలోని భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి ఏకనా క్రికెట్ స్టేడియంలో మార్చి 30న రాత్రి 7:30 గంటలకు ఐపీఎల్ 2024,17వ ఎడిషన్‌లో 11వ మ్యాచ్‌ లో లక్నో సూపర్ జెయింట్స్, హోమ్ టీం పంజాబ్ కింగ్స్ ని ఢీ కొట్టనుంది. వరుసగా రెండు సంవత్సరాలు ప్లేఆఫ్‌ లకు చేరుకున్న లక్నో సూపర్ జెయింట్స్ టీంకు ఈ సీజన్‌లో కూడా ఎక్కువ అంచనాలు ఉన్నాయి. జైపూర్‌ లో రాజస్థాన్ రాయల్స్ (RR) పై ఇరవై పరుగుల తేడాతో ఓడిపోవడంతో కేఎల్ రాహుల్ నేతృత్వంలోని లక్నో సూపర్ జెయింట్స్ తమ 2024 సీజన్ ను ఓటమితో ప్రారంభించింది. అయితే భారీ మద్దతుతో కింగ్స్‌తో జరిగే తొలి హోమ్ మ్యాచ్‌ లో సీజన్ లో మరో విజయం సాధించాలని సిద్ధంగా ఉంది.

Also Read: Indian Navy: 23 మంది పాక్ సిబ్బందిని రక్షించిన ఇండియన్ నేవీ..

సూపర్ జెయింట్స్ చివరి గేమ్ చూస్తే.., టాప్ ఆర్డర్ పతనం తర్వాత,కేఎల్ రాహుల్ 58(44) గాయం నుండి సుదీర్ఘ విరామం తర్వాత క్రికెట్‌కు తిరిగి వచ్చాడు. ఇక రాహుల్ తోపాటు నికోలస్ పూరన్ 64(41) కూడా అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. కానీ., దురదృష్టవశాత్తు మ్యాచ్‌ ను ముగించడంలో విఫలమయ్యాడు. కేఎల్ రాహుల్ మరియు నికోలస్ పూరన్ మొదట అద్భుతమైన భాగస్వామ్యాన్ని 85(52) తర్వాత ఏ బ్యాట్సమెన్ కూడా చెప్పుకోతగ్గ స్కోర్ చేయలేదు.

Also Read: Off The Record : టీడీపీని ఇప్పుడు కొత్తగా వెంటాడుతున్న భయం ఏంటి..?

మరోవైపు, చండీగఢ్‌ లోని ముల్లన్‌పూర్‌ లోని వారి కొత్త హోమ్ గ్రౌండ్‌ లో ఢిల్లీ క్యాపిటల్స్ పై నాలుగు వికెట్ల తేడాతో విజయంతో వారి సీజన్‌ను ప్రారంభించింది. కానీ., సీజన్‌ లోని తమ రెండో గేమ్‌ లో బెంగళూరులో జరిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)తో జరిగిన మ్యాచ్‌ లో పరాజయం పాలయ్యారు. ఇక వీరిద్దరూ హెడ్-టు-హెడ్ చూస్తే.. ఐపీఎల్ టోర్నమెంట్ చరిత్రలో మూడు సార్లు తలపడి ఇరు జట్లు. సూపర్ జెయింట్స్ రెండు సార్లు గెలిస్తే.. పంజాబ్ కింగ్స్ కేవలం ఒక విజయంతో ఉన్నారు.