MS Dhoni New CSK Jersey Goes Viral: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024 ఎడిషన్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్‌కు కొత్త స్పాన్సర్ వచ్చింది. యూఏఈ చెందిన ఎతిహాద్ ఎయిర్‌వేస్.. సీఎస్‌కేతో ఒప్పందం కుదుర్చుకుంది. చెన్నైలో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో ఈ భాగస్వామ్యానికి సంబధించిన జెర్సీని ఆవిష్కరించారు. ముందుగా చెన్నై కెప్టెన్ ఎంఎస్ ధోనీ జెర్సీని లాంచ్ చేశారు. కెప్టెన్ కూల్ ఈవెంట్‌లో భాగం కాలేదు కానీ.. అతని జెర్సీని మాత్రం ఆవిష్కరించారు. కొంతమంది సీఎస్‌కే ఆటగాళ్లు ఎతిహాద్ లోగో ఉన్న కొత్త జెర్సీని వేసుకున్నారు. ఇందుకు సంబందించిన ఫొటోస్ నెట్టింట వైరల్ అయ్యాయి.
చెన్నై సూపర్ కింగ్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కాశీ విశ్వనాథన్ కొత్త ఒప్పందం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఈ భాగస్వామ్యం సాంప్రదాయ స్పాన్సర్‌షిప్ కంటే గొప్పదని పేర్కొన్నారు. ‘చెన్నై సూపర్ కింగ్స్‌ను మా స్పోర్ట్స్ పోర్ట్‌ఫోలియోకు స్వాగతిస్తున్నాం. ఈ రోజు అసాధారణమైన ప్రయాణం ప్రారంభమైనట్లు ఉంది. మా సహకారం స్పాన్సర్‌షిప్‌కు మించినది. భారతదేశంలో క్రికెట్ ఆటకు ఉన్న అభిమానం నమ్మశక్యం కానిది. ఈ దేశంలో ఆటను ప్రేమించడం, నిజమైన అభిరుచిని కలిగి ఉండటం అంటే ఏమిటో చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులను చూస్తే తెలుస్తుంది’ అని ఎతిహాద్ ఎయిర్‌వేస్ చీఫ్ రెవెన్యూ ఆఫీసర్ అరిక్ డి అన్నారు.
Also Read: Vivek Taneja: వాషింగ్టన్‌లో దాడి.. మృతిచెందిన భారత సంతతి వ్యాపారవేత్త!
ఐపీఎల్ 2023లో మోకాలి నొప్పితో తీవ్రంగా ఇబ్బంది పడిన ఎంఎస్ ధోనీ.. టోర్నీ అనంతరం శస్త్రచికిత్స చేయించుకున్నాడు. శస్త్రచికిత్స అనంతరం కోలుకున్న మహీ.. గత రెండు నెలలుగా ఫిట్‌నెస్‌పై ఫోకస్ పెట్టాడు. ఐపీఎల్ 2024 కోసం ధోనీ ఇప్పటికే తన ప్రాక్టీస్‌ను ప్రారంభించాడు. ఐదుసార్లు సీఎస్‌కేను ఛాంపియన్‌గా నిలిపిన ధోనీ.. ముంబై మాజీ కెప్టెన్ రోహిత్ శర్మతో సమంగా నిలిచాడు. ఈ ఏడాది సీఎస్‌కే టైటిల్ గెలిస్తే.. రికార్డు నెలకొల్పుతాడు.
Launch of @etihad as the new Title Sponsor for @ChennaiIPL at #chennai#csk pic.twitter.com/vOUAEAhPLR
— Praveenbabu (@bpraveenbabu96) February 8, 2024