NTV Telugu Site icon

IPL 2024 – CSK VS GT: సీఎస్​కే పై గుజరాత్​ టైటాన్స్ ​దే పైచేయి.. మరి ఈసారి రిజల్ట్ ఎలా ఉండబోతుందో..?!

2

2

ఐపీఎల్ 2024 లో భాగంగా మంగళవారం సాయంత్రం 7:30 గంటలకు చెన్నై వేదికగా చిన్నస్వామి స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య నేడు మ్యాచ్ జరగబోతోంది. ఇరు జట్లకు కొత్త కెప్టెన్స్ కావడంతో ఈ మ్యాచ్ పై భారీ అంచనాలు పెరిగాయి. శుభమన్ గిల్, రుతురాజు గైక్వాడ్ లో ఎవరు గెలుస్తానని క్రికెట్ లవర్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నేటి మ్యాచ్ గురించి ఇతర వివరాలు ఒకసారి చూస్తే..

Also read: Sreeleela : అదిరిపోయే లుక్ లో శ్రీలీలా కిర్రాక్ పోజులు..

2022 లోనే ఐపీఎల్లోకి గుజరాత్ టైటాన్స్ హార్థిక్ పాండే కెప్టెన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఇక ఇప్పటివరకు గుజరాత్ టైటాన్స్ ఆడిన మ్యాచ్లు సంఖ్య తక్కువ కాబట్టి.. ఇప్పటివరకు సూపర్ కింగ్స్ తో కేవలం 5 సార్లు తెలపడింది గుజరాత్ టైటాన్స్. మ్యాచులు తక్కువ ఆడిన అద్భుత ప్రదర్శన కనపరిచింది. దాంతో గుజరాత్ టైటాన్స్ అరంగ్రేట్రం చేసిన సీజన్ లోనే తొలి ట్రోఫీని కైవసం చేసుకుంది. ఇక చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన ఐదు మ్యాచ్ ల్లో గుజరాత్ టైటాన్స్ మూడుసార్లు విజయనందుకుంది. రెండుసార్లు చెన్నై సూపర్ కింగ్స్ గెలుపొందింది. దీంతో ఇరు జట్ల మధ్య 3 – 2 గా విజయాలు ఉన్నాయి.

Also read: MS Dhoni: ఎంఎస్ ధోనీకి ఎవరూ సరితూగరు!

ఇక ఈ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ గెలిస్తే ఈ డిఫరెన్స్ మరింతగా పెరగనుంది. ఇక చెన్నై సూపర్ కింగ్స్ గెలిస్తే మాత్రం ఇరు ఇట్లు సమానంగా ఉంటాయి. ఇక ఈ సీజన్ లో ఇరు జట్లు తలబడిన మొదటి మ్యాచ్లో విజయాలను అందుకున్నాయి. మొదటి మ్యాచ్ లో ఆర్సిబి తో జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు విజయం సాధించగా… ఇక గుజరాత్ టైటాన్స్ ముంబై ఇండియన్స్ పై గెలిచి ఆత్మవిశ్వాసంతో ఉంది. చూడాలి మరి నేడు రాత్రి జరగబోయే మ్యాచ్ లో కొత్త కెప్టెన్లు వారి టీంని ఎవరు విజయం వైపు నడిపిస్తారో.