Akash Ambani classy reply to Rohit Sharma’s Fans at IPL 2024 Auction: దుబాయ్ వేదికగా మంగళవారం ఐపీఎల్ 2024కు సంబదించిన వేలం జరిగిన విషయం తెలిసిందే. ఈ మినీ వేలం దుబాయ్‌లోని కోకాకోలా ఎరీనాలో జరగ్గా.. భారీగానే అభిమానులు అక్కడకు వచ్చారు. అందులో ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ కూడా చాలా మందే ఉన్నారు. ముంబై ఫ్రాంచైజీ యజమాని ఆకాశ్ అంబానీ వేలం అనంతరం బయటికి రాగానే.. ‘రోహిత్ శర్మను మళ్లీ కెప్టెన్‌గా చేయండి’ అని గట్టిగా అరిచారు. అందుకు ఆకాశ్ సమాధానం ఇస్తూ.. ‘అస్సలు ఆందోళన వద్దు. రోహిత్ బ్యాటింగ్ చేస్తాడు’ అని చెప్పాడు. ఇందుకు సబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ మార్పు ఆ జట్టు అభిమానులను షాక్‌కు గురి చేసింది. ఐదు టైటిళ్లను అందించిన రోహిత్ శర్మను తప్పించి.. హార్దిక్ పాండ్యాను సారథిగా నియమించడం హిట్‌మ్యాన్ అభిమానులకు మింగుడుపడడం లేదు. దీంతో సోషల్ మీడియా వేదికగా ముంబై ఫ్రాంచైజీపై మండిపడుతున్నారు. చాలా మంది ఫాన్స్ ముంబై జట్టు సోషల్ మీడియా ఖాతాలను అన్‌ఫాలో చేశారు. అసంతృప్తిలో ఉన్న హిట్‌మ్యాన్ ఫాన్స్.. ముంబై ఫ్రాంచైజీ యజమాని ఆకాశ్ అంబానీ కనిపించగానే మళ్లీ కెప్టెన్ చేయండి అని పెద్దగా నినాదాలు చేశారు.
Also Read: Motorola Offers: మోటోరోలా బంపర్ ఆఫర్.. ఆ ఫోన్లపై రూ 10 వేల డిస్కౌంట్!
2013 సీజన్‌లో ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ నియమించబడ్డాడు. అదే ఏడాది రోహిత్ ముంబైకి మొట్టమొదటి ఐపీఎల్ టైటిల్ అందించాడు. 2015, 2017, 2019, 2020లో ముంబైకి రోహిత్ టైటిల్ అందించాడు. గత మూడు సీజన్‌లలో ముంబై పేలవ ప్రదర్శన చేసింది. రోహిత్ సారథ్యంలో 2021, 2022లో గ్రూప్ దశ నుంచే ఇంటిదారి పట్టిన ముంబై.. 2023లో ఫైనల్‌కు అర్హత సాధించడంలో విఫలమైంది. దాంతో ముంబై రోహిత్ స్థానంలో హార్దిక్ పాండ్యాను సారథిగా నియమించింది.