NTV Telugu Site icon

Sunil Gavaskar: ధోని లాంటి కెప్టెన్ లేడు.. ఇక ముందు రాలేడు..

Gavasker

Gavasker

టీమిండియా దిగ్గజం సునీల్ గావస్కర్ చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్ర సింగ్ ధోనిపై ప్రశంసల జల్లు కురుపించాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో అత్యుత్తమ కెప్టెన్ ధోనినే అంటూ కితాబు ఇచ్చాడు. భవిష్యత్ లో కూడా తనలాంటి సారథి మరెవరూ రాబోరంటూ మిస్టర్ కూల్ ను సునీల్ గావస్కర్ ఆశానికెతాడు. టీమిండియాకు మూడు ఐసీసీ టైటిళ్ల అందించిన ఎంఎస్ ధోని.. ఐపీఎల్ లో చెన్నైకు కెప్టెన్ గా జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. ఇప్పటికే సీఎస్కే ను నాలుగు సార్లు ఛాంపియన్ గా నిలిపిన ఘనత ఎంఎస్ ధోనీదే. ఇక ఇటీవల రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ తో చెన్నై కెప్టెన్ గా 200 మ్యాచ్ పూర్తి చేసుకున్నాడని గావస్కర్ అన్నాడు. తద్వారా క్యాష్ రిచ్ లీగ్ చరిత్రలో ఈ అరుదైన ఘనత సాధించిన ఏకైక సారథిగా 41 ధోని నిలిచాడు. ఇదిలా ఉంటే ఐపీఎల్ 2023లో ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్ ల్లో సీఎస్కే రెండింట గెలిచింది.

Read Also : ISIS terrorist : సిరియన్ ఎడారిలో ఐసిస్ కిరాతకం.. 31 మంది పౌరులు హతం

ఈ క్రమంలో ఇవాళ బెంగళూరు వేదికగా ఆర్సీబీతో ఆడుతుంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ బ్రాడ్ కాస్టర్ షోలో ధోని గురించి గావస్కర్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. సీఎస్కే కు గడ్డు పరిస్థితుల నుంచి ఎలా బయటపడాలో తెలుసు.. ఎంఎస్ ధోని కెప్టెన్సీలో మాత్రమే సీఎస్కే కు ఇది సాధ్యపడుతుందని అన్నాడు. 200 మ్యాచ్ లకు కెప్టెన్ గా వ్యవహరించడం అంటే మామూలు విషయం కాదు.. అన్నేసి మ్యాచ్ లకు సారథ్యం వహించడం అంటే మోయలేని భారాన్ని నెత్తినవేసుకున్నట్లే అని గావస్కర్ వ్యాఖ్యనించాడు. అది వ్యక్తిగత ప్రదర్శనైప ప్రభావం చూపే అవకాశం ఉంది. సాధారణంగా అందరు ఆటగాళ్ల విషయంలో జరిగేది ఇదే.. అయితే అందుకు మహేంద్ర సింగ్ ధోని భిన్నమని గవాస్కర్ పేర్కొన్నాడు. అతడు ప్రత్యేక సామర్థ్యాలు కలిగిన కెప్టెన్.. తనలాంటి కెప్టెన్లు ఇంత వరకు ఎవరూ లేరు.. ఇక ముందు కూడా రాలేరు.. అతుడ అత్యత్తమ కెప్టెన్ అని టీమిండియా మాజీ సారథి ఎంఎస్ ధోనిపై సునీల్ గావస్కర్ ప్రశంసల వర్షం కురిపించాడు. కాగా చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ గా 200 మ్యాచ్ లు ఆడిన ధోని ఖాతాలో 120 విజయాలు 79 సార్లు ఓటమి ఎదురైంది. ఒక మ్యాచ్ డ్రా గా ముగిసింది.

Read Also : ISIS terrorist : సిరియన్ ఎడారిలో ఐసిస్ కిరాతకం.. 31 మంది పౌరులు హతం

Show comments